సంసద్ టీవీగా విలీనమైన రాజ్యసభ, లోక్ సభ చానల్స్

0
613

ప్రసార భారతి ఆధ్వర్యంలో నడిచే లోక్ సభ టీవీ, రాజ్య సభ టీవీ ఇకమీదట ఒకే గొడుగు కింద సంసద్ టీవీ పేరుతో ప్రసారం అవుతాయి. ఈ కొత్త సంస్థకు రిటైర్డ్ ఐ ఎ ఎస్ అధికారి రవి కపూర్ సీఈవోగా నియమించారు. ఆయన నియామకం తక్షణం అమలులోకి వస్తుంది. ఇప్పుడు రాజ్యసభ సీవోగా ఉన్న మనోజ్ కుమార్ పాండే ని తొలగించారు.
సంసద్ టీవీ కింద రెండు చానల్స్ ( లోక్ సభ టీవీమ్ రాజ్య సభ టీవీ) రెండూ నడుస్తాయి., ఉభసభల ప్రత్యక్ష ప్రసారాలను అవి అందిస్తాయి. రాజ్యసభ చైర్మన్ వెంకయ్య నాయుడు, లొక్ సభ స్పీకర్ ఓమ్ బిర్లా ఉమ్మడిగా చర్చించి ఈ నిర్ణయం తీసుకున్నారు. కేవలంమ్ పాలనా పరమైన సౌలభ్యం, అనవసర ఖర్చు నియంత్రణ కోసమే ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తుంది. ఎమ్మెస్వోలు మాత్రం మస్ట్ కారీ నిబంధనల ప్రకారం ఎప్పటిలాగానే ఈ రెండు చానల్స్ ప్రసారం చేయాల్సి ఉంటుంది.
ఈ రెండు చానల్స్ నిర్వహణను ఒకే గొడుగు కిందికి తేవాలన్న ఆలోచనమీద నిరుటి నుంచే సమాలోచనలు జరుగుతున్నాయి. ఇందుకోసం ఒక కమిటీని ఏర్పాటు చేయగా సాంకేతిక వనరులను, మానవవనరులను సమీకృతం చేయటం మంచిదనే అభిప్రాయం వ్యక్తమైంది. సంసద్ టీవీ ఇంగ్లీష్, హిందీ భాషల్లో అందుబాటులో ఉంటుంది, లోక్ సభ టీవీ 2006 లోనూ, రాజ్యసభ టీవీ 2011 లోనూ మొదలైన సంగతి తెలిసిందే.
ఇప్పుడు సంసద్ టీవీ సీఈవోగా నియమితుడైన రవి కపూర్ అస్సాం-మేఘాలయ కేడర్ 1986 బ్యాచ్ ఐ ఎ ఎస్ అధికారి. ఉద్యోగ విరమణకు ముందు జౌళి మంత్రిత్వశాఖ కార్యదర్శిగా పనిచేశారు. అస్సాంలో అదనపు ప్రభుత్వప్రధాన కార్యదర్శిగా 2016-19 మధ్య పనిచేశారు. అలాగే 2011-16 మధ్య వాణిజ్య, పరిశ్రమల మంత్రిత్వశాఖలో ఎగ్జిక్యుటివ్ డైరెక్టర్ గా, అంతకుముందు పెట్రోలియం మంత్రిత్వశాఖలో డైరెక్టర్ గా కూడా పనిచేశారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here