తప్పుడు వార్త ప్రచారం చేసిన రాజ్ దీప్ సర్దాయ్ కి ఉద్వాసన

0
571

టీవీ పరిశ్రమలో పేరుమోసిన జర్నలిస్ట్ రాజ్ దీప్ సర్దేశాయ్ ఒక తప్పుడు వార్తను నమ్మి ప్రసారం చేసినందుకు ఆయన ఇండియా టుడే సంస్థ నుంచి తప్పుకోవాల్సి వచ్చింది. తెరమీద కన్పించవద్దని ఇండియా టూడే యాజమాన్యం ఆయనను ఆదేశించినట్టు ఒక వైపు ప్రచారం జరుగుతుండగా ఆయనే రాజీనామా చేసినట్టు మరోవైపు చెబుతున్నారు.
రిపబ్లిక్ దినోత్సవం నాడు రైతులు తలపెట్టిన ట్రాక్టర్ ర్యాలీ సమయంలో పోలీసు కాల్పుల్లో ఒక యువరైతు చనిపోయినట్టు ఆయన ట్వీట్ చేశారు. “45 ఏళ్ళ నవనీత్ అనే రైతు పొలీస్ కాల్పుల్లో చనిపోయాడు, రైతులారా చెప్పండి: ఈ త్యాగం వృధా కాదు. “ అని ఆ ట్వీట్ లో పేర్కొన్నారు. అంతటితో ఆగకుండా లైవ్ లో కూడా ఆ యువకుడు ఎలా చనిపోయిందీ వివరించారు. అయితే, నిజానికి ఆ రైతు ట్రాక్టర్ బోల్తా పడటం వల్ల మరణించాడు. ఆ తరువాత కొద్ది సేపటికి సర్దేశాయ్ తన ట్వీట్ ను తొలగించటంతోబాటు తన తప్పుకు క్షమాపణ చెప్పారు.
ఇలాంటి పొరపాటు వార్తలతో వివాదాలలో చిక్కుకోవటం రాజ్ దీప్ సర్దేశాయ్ కి కొత్త కాదు రాష్ట్రపతి భవన్లో సుభాస్ చంద్ర బోస్ చిత్రపటం ఆవిష్కరణకు సంబంధించిన వార్త విషయంలోనూ అదే జరిగింది. నిరుడు అప్పటి రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ మరణ వార్తను కూడా అదే విధంగా ప్రకటించి, ఆ తరువాత నాలుక కరచుకొని ట్వీట్ తొలగించారు. ప్రణబు కొడుకు, కూతురితోబాటు పలువురు ట్వీట్ చేశాక ఆయన తప్పు దిద్దుకున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here