త్వరలో డిడి ఇండియా హెచ్ డి ప్రసారాలు

0
621

ప్రభుత్వ ప్రసార సంస్థ ప్రసారభారతి త్వరలో తన ఇంగ్లిష్ న్యూస్ చానల్ డిడి ఇండియా చానల్ ను హెచ్ డి లో అందించటానికి ఏర్పాట్లు పూర్తి చేసింది. ఈ మేరకు ఇప్పటికే డిడి రెట్రో, డిడి స్పోర్ట్స్ లో స్క్రోల్ నడుపుతున్నారు. అక్టోబర్ 3 నుంచి ఈ చానల్ అందుబాటులోకి వస్తుంది. సి-05, జిశాట్-10 ట్రాన్స్ పాండర్ నుంచి చానల్ ప్రసారం కాబోతున్నట్టు డౌన్ లింకింగ్ పారామీటర్లను బట్టి తెలుస్తోంది.
ఇదే ట్రాన్స్ పాండర్ లో డిడి నేషనల్, డిడి న్యూస్, డిడి భారతి, డిడి కిసాన్, డిడి ఉర్దు, డిడి స్పోర్ట్స్, ఆర్ ఎస్ టీవీ, డిడి ఫీడ్, డిడి నేషనల్ (హెచ్ డి), డిడి న్యూస్ (హెచ్ డి), డిడి ఇండియా (హెచ్ డి), డిడి ఫీడ్ (హెచ్ డి) ఉన్నాయి. దూరదర్శన్ ప్రస్తుతం హై దెఫినిషన్ లో డిడి నేషనల్, డిడి న్యూస్ చానల్స్ ను డిడి ఫ్రీడిష్ ద్వారా, టాతా స్కై ద్వారా అందిస్తోంది.
తాజా రేటింగ్స్ ప్రకారం డిడి ఇండియా చానల్ ఇంగ్లిష్ న్యూస్ చానల్స్ లో నాలుగో స్థానంలో ఉండటంతో బాటు ఎన్డీటీవీ, ఇండియా టుడే కంటే ముందుండటం గమనార్హం. డిడి భారతి, డిడి రెట్రో కూడా హెచ్ డి లో ఇవ్వాలనే ఆలోచన ఉందని, అదనపు సామర్థ్యం కోసం ఇస్రో కు లేఖ రాశామని ఇటీవలే ప్రసార భారతి సీఈవో శశి శేఖర్ వెంపటి ఒక ప్రశ్నకు సమాధానంగా ట్వీట్ చేశారు. హెచ్ డి చానల్ కు అవసరమయ్యే శాటిలైట్ సామర్థ్యం ఎస్ డి చానల్ కు మూడు రెట్లు అదనంగా ఉంటుంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here