పోస్టల్ రిజిస్ట్రేషన్ ఉన్నా, ఎంఐబి రిజిస్ట్రేషన్ తప్పనిసరి

0
1740

కేబుల్ ఆపరేటర్లు పోస్టల్ రిజిస్ట్రేషన్ చేసుకోవటం తెలిసిందే. అయితే, డిజిటైజేషన్ అయ్యాక డిజిటల్ ఎమ్మెస్వోల తరహాలో కేబుల్ ఆపరేటర్లు కూడా సమాచార, ప్రసార మంత్రిత్వశాఖ దగ్గర రిజిస్ట్రేషన్ చేసుకోవాలన్న నిబంధన కూడా ఉంది. ఎమ్మెస్వోలు దరఖాస్తు రుసుము కింద లక్ష రూపాయలు చెల్లిస్తే కేబుల్ ఆపరేటర్ రూ.5 వేలు చెల్లించాలి. ఆన్ లైన్ లో దరఖాస్తు నింపటానికి, చెల్లింపు జరపటానికి అవకాశం ఉంది.
దరఖాస్తు దారుడు ముందుగా www.broadcastseva.gov.in లో లాగిన్ కావాలి. కేబుల్ ఆపరేటర్ స్వయంగా దరఖాస్తు చేయవచ్చు లేదా తాను ఆథరైజేషన్ ఇచ్చిన వ్యక్తిచేత దరఖాస్తు చేయించవచ్చు. అయితే, ఫలానా వ్యక్తిని ఆథరైజ్ చేస్తున్నానని తెలియజేసే పత్రం కూడా సమర్పించాలి. ఈ పత్రం మీద ఆ ఆపరేటర్ సొంత వ్యాపారమైతే ఒక్కడే సంతకం చేయాలి, భాగస్వామ్య సంస్థ అయితే భాగస్తులందరూ సంతకం చేయాలి, రిజిస్టర్డ్ కంపెనీ అయితే డైరెక్టర్లందరూ సంతకం చేయాలి.
ఇక అర్హతల విషయానికి వస్తే భారత పౌరుడై ఉందాలి, 18 ఏళ్ళు పైబడి ఉండాలి; కంపెనీ అయితే, విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల విషయంలో ప్రభుత్వ నిబంధనలకు కట్టుబడాలి. మతిస్థిమితం కోల్పోయిన వ్యక్తిగా కోర్టు నిర్థారించి ఉండకూడదు. దివాలా తీసినట్టు కూడా కోర్టు ప్రకటించి ఉండకూడదు. క్రిమినల్ కేసులో శిక్ష పడి ఉండకూడదు.
ఆన్ లైన్ లో దరఖాస్తు చేసిన తరువాత ఆ సమాచారాన్ని డౌన్ లోడ్ చేసుకొని మొత్తం పత్రాలను స్పీడ్ పోస్ట్ ద్వారా సమాచార, ప్రసార మంత్రిత్వశాఖకు పంపాలి. దరఖాస్తు ఫీజు కింద రూ. 5,000 భారత్ కోశ్ పోర్టల్ (www.bharatkosh.gov.in) లో “ ప్రాసెసింగ్ ఫీ ఫర్ ఎల్ సి వో రిజిస్ట్రేషన్ “ అనే ఖాతా కింద చెల్లించాలి. ఆ తరువాత అందే చలానా ప్రింట్ తీసి దరఖాస్తుతోబాటు పంపాలి.
దరఖాస్తుతోబాటు సమర్పించాల్సిన పత్రాలు:

  1. భాగస్వామ్య సంస్థ లేదా కంపెనీ అయితే ఆ రిజిస్ట్రేషన్ పత్రాలు
  2. పోస్టల్ రిజిస్ట్రేషన్
  3. పాన్ కార్డ్
  4. సంస్థ అయితే జీ ఎస్టీ
  5. భారత్ కోశ్ లో కట్టిన రూ.5000 కు చలానా
  6. దరఖాస్తుదారు తరఫున మరెవరినైనా దరఖాస్తు చేయటానికి ఆథరైజ్ చేసి ఉంటే ఆ ఆథరైజేషన్ పత్రం
  7. ఫామ్-2 ప్రకారం రూ.10 స్టాంప్ పేపర్ మీద సెల్ఫ్ డిక్లరేషన్ ఇచ్చి నోటరీ చేయించాలి.
    ఈ పత్రాలన్నీ ఆన్ లైన్ రిజిస్ట్రేషన్ ఫామ్ నింపిన 15 రోజుల్లోగా స్పీడ్ పోస్ట్ ద్వారా సమాచార, ప్రసార మంత్రిత్వశాఖకు పంపాలి. అన్నీ సక్రమంగా ఉంటే రిజిస్ట్రేషన్ పత్రం వస్తుంది. ఈ స్పీడ్ పోస్ట్ వివరాలు కూడా అన్ లైన్న్ దరఖాస్తులో తెలియజేయాలి.
    ఇలా వచ్చే ఎల్ సీ వో రిజిస్త్రేషన్ ఐదేళ్ళపాటు అమలులో ఉంటుంది. ఐదేళ్ళ తరువాత రెన్యూవల్ కూడా ఇదే పద్ధతిలో ఉంటుంది.
    ఇప్పుడు కేబుల్ చానల్స్ నడుపుకోవాలంటే ఎంఐబి రిజిస్త్రేషన్ తప్పని సరి అని ట్రాయ్ చెబుతున్న మాట తెలిసిన విషయమే. అందువలన సొంత కేబుల్ చానల్స్ నడపాలనుకునేవారు డిజిటల్ ఎల్ సి వో రిజిస్ట్రేషన్ తప్పనిసరిగా తీసుకోవాలి.
    రిజిస్ట్రేషన్ విధి విధానాల గురించి తెలుసుకోవాలంటే ఈ లింక్ క్లిక్ చేయండి:
    http://broadcastseva.gov.in/das_loading_page/Registration%20procedure%20for%20LCO.pdf
    జత చేయాల్సిన డాక్యుమెంట్లు: (వ్యక్తులు)
    http://broadcastseva.gov.in/das_loading_page/Documents%20required%20to%20submit%20with%20application%20for%20individuals_LCO.pdf
    జత చేయాల్సిన డాక్యుమెంట్లు: (భాగస్వామ్య సంస్థలు)
    http://broadcastseva.gov.in/das_loading_page/Documents%20required%20to%20submit%20with%20application%20for%20association%20of%20individuals%20or%20body%20of%20individuals_LCO.pdf
    జత చేయాల్సిన డాక్యుమెంట్లు: (కంపెనీలు)
    http://broadcastseva.gov.in/das_loading_page/Documents%20required%20to%20submit%20with%20application%20for%20Company_LCO.pdf

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here