పోల్ టాక్స్ జీవో రద్దుపై రౌండ్ టేబుల్ సమావేశం..

0
336

తెలంగాణలో విద్యుత్ పోల్ టాక్స్ జీవోను తక్షణమే రద్దు చేయాలనే విషయమై తెలంగాణలోని కేబుల్ మరియు ఇంటర్నెట్ ఆపరేటర్ల (MSO’s, ISP’s, LCO’s and Internet Operaters) ఆధ్వర్యంలో రౌండ్ టేబుల్ సమావేశం ఏర్పాటు చేయనున్నట్టు నిర్వాహకులు తెలియజేస్తున్నారు.

ఎంతోమంది నిరుద్యోగ యువతకు ఉపాధి మార్గంగా మారిన కేబుల్‌ మరియు ఇంటెర్నెట్ ఆపరేటర్ల వ్యవస్థ ఒకవైపు తీవ్రమైన పోటీ ఎదుర్కొంటున్న సమయంలో… దేశవ్యాప్తంగా సింగిల్ టాక్స్ విధానంలో భాగంగా జిఎస్టీ చెల్లిస్తూ అధనంగా ఏజీఆర్ కూడా చెల్లిస్తున్న తమపై పోల్ టాక్స్ పేరుతో అదనపు భారాన్ని మోపి కేబుల్‌ ఇంటెర్నెట్ ఆపరేటర్ల నడ్డివిరుస్తున్నారని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

రాష్ట్రంలో కొన్నిప్రాంతాలలో ఇప్పటికే పోల్ టాక్స్ కట్టాలంటూ పాతబాకీ రూపంలో నోటీసులు పంపుతున్నారని, దీనిపై వెంటనే కేబుల్ ద్వారా వ్యాపారం చేస్తున్న సంబందిత ఆపరేటర్లందరూ ఏకమై పోల్ టాక్స్ రద్దు చేసేందుకు ప్రభుత్వం పై వత్తడితెచ్చేలా కార్యాచరణ రూపొందించేందుకు ఈ సమావేశం ఎంతో దోహదపడుతుందని సతీష్ పేర్కొన్నారు.

2014 లో ముఖ్యమంత్రి కేసీఆర్ ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలని,కోరుతూ…

ఆపరేటర్లందరూ…. 2వ తేది, JULY 2022, ఉదయం 11 గంటలకు అమృతవాణి కమ్యూనికేషన్స్ సెంటర్, సికింద్రాబాద్ (మనోహర్ థియేటర్ ఎదురుగా ఫంక్షన్ హాల్ లో) జరిగే రౌండ్ టేబుల్ సమావేశానికి హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేసి మన వ్యాపారాన్ని రక్షించుకుందామని ఆహ్వానం పలుకుతున్నాము.

ఆహ్వానిస్తున్నవారు
ఫైబర్ అండ్ ఏరియల్ కేబుల్ ఆపరేటర్స్ అసోసియేషన్ (FACO)
ఫెడరేషన్ ఆఫ్ తెలంగాణ ఎమ్మెస్వోస్ (FTM)
కేబుల్ ఆపరేటర్స్ అసోసియేషన్ (COA)
బ్రాడ్బాండ్ ఆపరేటర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆఫ్ తెలంగాణ (BOWAT)

తెలంగాణ కేబుల్ మరియు ఇంటర్నెట్ ఆపరేటర్స్

మరిన్ని వివరాలకు సంప్రదించండి
099890 51275
097000 07653
09849052888
092463 46364

లొకేషన్:-
Amruthavani Communications Centre
50, S D Road, Sebastian Road, Regimental Bazaar, Shivaji Nagar, Secunderabad, Telangana 500003

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here