“ప్రజల స్వంత టీవీ సెటప్ బాక్సులను మార్చి కార్పోరేట్ సంస్థల ఉచ్చులోకి ప్రజలను పంపించ వద్దు. అక్రమంగా తీసుకున్న డబ్బులను, బాక్సులను ప్రజలకు తిరిగి ఇవ్వాలి.”….. నూనె వెంకట్ స్వామి.

0
1029

“యాదాద్రి జిల్లా గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లోని కొందరు టీవీ ఆపరేటర్లు కార్పోరేట్ సంస్థల సెటప్ బాక్స్ ల పేరుతో ప్రజలు సుమారు 1500 రూ.లు వెచ్చించి స్వంత డబ్బులతో కొనుక్కున్న సెటప్ బాక్సులను వాటి స్థానంలో కార్పొరేట్ సంస్థలకు సంబంధించిన సెటప్ బాక్సులను పెట్టడం సరైంది కాదు. ప్రజల ఇష్టాఇష్టాలతో కార్పోరేట్ సంస్థల సెటప్ బాక్సులను తీసుకుంటే తమకు అభ్యంతరం లేదని, కార్పోరేట్ సంస్థల సెటప్ బాక్సులను హెచ్డీ పేరుతో పెట్టి ప్రజల వద్ద 5 వందల రూపాయలను వసూలు చేస్తున్నారు. ఆ బాక్స్ లపై నాట్ ఫర్ సేల్ అని ఉన్నా కూడా డబ్బులు వసూలు చేయడం తగదని, మళ్ళీ వాటిని 5 వందల రూ. అమ్ముకుంటున్నారు. గ్రామీణ పట్టణ ప్రాంతాల్లో టీవీ ఆపరేటర్ల కొందరు ఇట్టి అక్రమ దందాను సాగిస్తున్నారు. ప్రజలు కొనుగోలు చేసుకున్న సెటప్ బాక్సులను మార్చే హక్కు వారికిలేదు. ప్రభుత్వ యంత్రాంగం వీటిని అడ్డుకోవాలని ప్రజల స్వంత సెటప్ బాక్సులను రక్షించాలని, కార్పొరేట్ సంస్థల అక్రమ చొరబాటును అడ్డుకుని ప్రజల బాక్సులను, డబ్బులను ప్రజలకు తిరిగి ఇచ్చే విధంగా చర్యలు తీసుకోవాలని” ప్రజా పోరాట సమితి (PRPS) రాష్ట్ర అధ్యక్షులు నూనె వెంకట్ స్వామి అన్నారు.

ఈరోజు యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్ అనితారామచంద్రన్ గారికి ఆ మేరకు మెమొరాండాన్ని అందజేశారు.

“ప్రజల ఇష్టాయిష్టాల మేరకు సెటప్బాక్సులు మార్చుకుంటే తమకు అభ్యంతరం లేదని, ఎక్కువ విలువైన సెట్టాప్ బాక్సుల స్థానంలో కార్పోరేట్ సంస్థలు నాట్ ఫర్ సేల్ సంబంధించిన సెటప్ బాక్సులను పెట్టి డబ్బు వసూలు చేసే వాటిని ప్రత్యేకంగా నియంత్రిస్తామని” జిల్లా కలెక్టర్ హామీ ఇచ్చారు.

మెమోరాండం అందజేసిన వారిలో PRPS జిల్లా నాయకులు పామనగుండ్ల ఫకీర్ గౌడ్, జిట్టా శ్రీకాంత్, రాచకొండ జగతయ్య, మారగోని శ్రీనివాస్ గౌడ్, గండు అంజయ్యయాదవ్, నన్నూరి యాదగిరిరెడ్డి, మోటె మల్లయ్యయాదవ్, గర్దాసు శ్రీనివాస్, గుంటోజు నరేంద్ర చారి, నాగటి పరమేశ్ తదితరులు ఉన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here