కొనసాగుతున్న స్టార్ మా ఆధిక్యం, సీరియల్స్ లోనూ అదే దూకుడు

0
437

తెలుగు టీవీ చానల్స్ రేటింగ్స్ లో స్టార్ మా ఆధిక్యం అప్రతిహతంగా కొనసాగుతోంది. మిగిలిన చానల్స్ దరిదాపుల్లో కూడా లేకపోవటం విశేషం. జాతీయ స్థాయిలోనూ నాలుగో స్థానం దక్కించుకుంది. కార్యక్రమాల పరంగా చూస్తే తెలుగు చానల్స్ లో టాప్ 5 కార్యక్రమాలు స్టార్ మా చానల్ కే దక్కగా అవన్నీ సీరియల్స్ కావటం మరో ప్రత్యేకత. క్
నవంబర్ 13 తో ముగిసినవారానికి బ్రాడ్ కాస్ట్ ఆడియెన్స్ రీసెర్చ్ కౌన్సిల్ ( బార్క్ ) అందించిన ప్రేక్షకాదరణ సమాచారం ప్రకారం స్టార్ మా కు 78.47 కోట్ల వీక్షణలు లభించగా జీ తెలుగు (50.39 కోట్లు), ఈటీవీ తెలుగు (42.53 కోట్లు), జెమిని టీవీ ( 29.08 కోట్లు) వరుసగా రెండు, మూడు, నాలుగు రాంకులు పొందాయి. తెలుగులో తొలి చానల్స్ అయిన జెమిని, ఈటీవీ ప్రేక్షకాదరణ కలిసినా స్టార్ మా టీవీ కంటే తక్కువే.
కార్యక్రమాల పరంగా చూసినా, స్టార్ మా చానల్ ది తిరుగులేని ఆధిక్యం. మొత్తం చానల్స్ లో టాప్ 5 కార్యక్రమాల జాబితా మొత్తాన్ని స్టార్ మా ఆక్రమించుకుంది. ఈ కార్యక్రమాలన్నీ సీరియల్స్ కావటం ఇంకో ఎత్తు. కోటిన్నర వీక్షణలతో కార్తీక దీపం నెంబర్ వన్ కార్యక్రమం స్థానంలో ఉండగా ఇంటింటి గృహలక్ష్మి (కోటీ 30 లక్షలు), వదినమ్మ (కోటీ 3 లక్షలు), దేవత (91 లక్షలు), చెల్లెలి కాపురం (72 లక్షలు) వరుసగా 2,3,4,5 రాంకులు సంపాదించుకున్నాయి.
బిగ్ బాస్ గాని, జబర్దస్త్ గాని టాప్ 5 కార్యక్రమాల్లో లేవు. నాలుగు వారాలుగా న్యూస్ చానల్స్ రేటింగ్స్ సమాచారాన్ని వెల్లడించకపోవటం తెలిసిందే.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here