‘డిజిటల్’ కలుపుకున్న న్యూస్ బ్రాడ్ కాస్టర్స్ కొత్త లోగో

0
461

న్యూస్ చానల్ యజమానులు ఏర్పాటు చేసుకున్న వార్తా ప్రసారకుల సంఘం (న్యూస్ బ్రాడ్ కాస్టర్స్ అసోసియేషన్) ఇప్పుడు తాజాగా డిజిటల్ మీడియాను కూడా కలుపుకుంటూ న్యూస్ బ్రాడ్ కాస్టర్స్ అండ్ డిజిటల్ అసోసియేషన్ ( ఎన్ బి డి ఏ) గా మారింది. ఈ నేపథ్యంలో కొత్తపేరుగు తగ్గట్టుగా సంస్థ తన లోగోను మార్చుకుంది.

టీవీ చానల్స్ తో బాటు డిజిటల్ బ్రాడ్ కాస్టర్లను కూడా కలుపుకున్నట్టు అర్థం వచ్చేలా రెండు వృత్తాలను కొత్త లోగోలో చూడవచ్చు. నీలం రంగు న్యూస్ చానల్స్ ను, చురుకైన వేదికగా పేరుపొందిన డిజిటల్ మీడియాను చూపటానికి ఆరెంజ్ రంగును ఎఎ లోగోలో వాడుకున్నారు. అదే విధంగా డి అక్షరాన్ని కూడా ఆరెంజ్ రంగు లోనే చూపారు.

దేశంలో అతిపెద్ద న్యూస్ చానల్స్ సంఘంగా ఎన్ బి డి ఏ కు పేరుంది. ప్రేక్షకాదరణ పరంగా చూస్తే 80% మార్కెట్ వాటా ఉన్న న్యూస్ మీడియా టీవీ, డిజిటల్ సంస్థలు ఈ సంఘంలోనే ఉన్నట్టు చెబుతారు. టెక్నాలజీలో వస్తున్న భారీ మార్పులకు అనుగుణంగా పెరుగుతున్న డిజిటల్ మీడియాను కలుపుకుంటూ భవిష్యత్తు లోకి చూస్తున్నట్టు సంఘం చెబుతోంది. ప్రస్తుతం ఈ సంఘానికి రజత శర్మ కొంతకాలంగా అధ్యక్షునిగా కొనసాగుతున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here