తెలుసుకుందాం : కొత్త టారిఫ్ ఆర్డర్ కథ

0
639

బ్రాడ్ కాస్ట్ రంగాన్ని నియంత్రించే టెలికామ్ రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా ( ట్రాయ్) 2017 మార్చి 3 న ఇంటర్ కనెక్షన్ నిబంధనలు, టారిఫ్ ఆర్డర్, నాణ్యమైన సేవల ప్రమాణాలు, వినియోగదారుల రక్షణ పేరిట మూడు ఆదేశాలు జారీచేసింది. అయితే, ఈ మూడింటినీ కలిపి మనం కొత్త టారిఫ్ ఆర్డర్ అని పిలుచుకుంటున్నాం.  ఇది 2019 ఫిబ్రవరి 1 నుంచి అమలులోకి వచ్చింది.

అయితే, 2020 జనవరి 1న ట్రాయ్ ఈ కొత్త టారిఫ్ ఆర్డర్ ను సవరించింది. అమలులోకి వచ్చిన పదినెలల్లోనే నియంత్రణ చట్టంలో కీలకమైన మార్పులు తెచ్చేందుకు ఈ సవరణకు పూనుకుంది. దీనికి ముందు 2019  ఆగస్టు 16న,  2019 సెప్టెంబర్ 25న ట్రాయ్ రెండు చర్చాపత్రాలు విడుదలచేసి ఈ రంగంలోని భాగస్వాములందరూ అభిప్రాయాలు చెప్పాలని కోరింది.

 కొత్త టారిఫ్ ఆర్డర్ పట్ల పరిశ్రమలోని వివిధ వర్గాల అభిప్రాయాలు, అభ్యంతరాలకు ట్రాయ్ స్పందించిన తీరును, కొత్త టారిఫ్ ఆర్డర్ ప్రభావాన్ని చర్చించటం మీద ఈ వ్యాసం దృష్టి సారిస్తుంది.

టీవీ బ్రాడ్ కాస్టింగ్ మీద నియంత్రణ నిబంధనలు అనలాగ్ వ్యవస్థలో, అడ్రెసిబుల్ వ్యవస్థలో వేరువేరుగా ఉన్నాయి. దీనివలన ఈ వ్యాపారంలో అనేక వివాదాలమీద కోర్టుకు వెళ్ళాల్సిన  అవసర

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here