నిర్లక్ష్యం నీడలో కేబుల్ రంగం- పోరు బాటలో తెలుగు రాష్ట్రాల ఎమ్మెస్వోలు, ఆపరేటర్లు

0
644

ఫ్రంట్ లైన్ వారియర్లుగా గుర్తించాలని డిమాండ్
బీమా సౌకర్యం, పాస్ లు అనివార్యమని స్పష్టీకరణ
టీకాలలో ప్రాధాన్యం ఇవ్వాలని ప్రభుత్వానికి సూచన
కేబుల్ రంగానికి చెందిన కోవిడ్ మృతులకు నివాళులు
ఒక రోజు పగలంతా ప్రసారాల నిలిపివేత యోచన
కేబుల్ టీవీ రంగం అనేక సమస్యలతో సతమతమవుతున్నప్పుడే ట్రాయ్ మరికొన్ని నిబంధనలు విధిస్తూ నిరుడు జనవరి 1న కొత్త టారిఫ్ ఆర్డర్ (ఎన్ టి వో 2.0) ప్రకటించింది. ఉచిత చానల్స్ ను రెట్టింపు చేయటం, రెండో కనెక్షన్ కు 40% మాత్రమే నెట్ వర్క్ కెపాసిటీ ఫీజు వసూలు చేసుకోవాలనటం లాంటివి కేబుల్ రంగాన్ని బాగా దెబ్బతీయటానికేనని అర్థమవుతూ ఉంది. ఇంకోవైపు సెట్ టాప్ బాక్స్ పోర్టబిలిటీ లాంటి బెదరింపులతో ఎమ్మెస్వోలు, ఆపరేటర్లు పెట్టిన పెట్టుబడికే నష్టం వచ్చే అలోచనలూ చేస్తూ ఉంది.
నిరుడు లాక్ డౌన్ సమయంలో కేబుల్ రంగం ఎదుర్కున సమస్యలు అన్నీ ఇన్నీ కావు. పాత ప్రసారాలతో బ్రాడ్ కాస్టర్లు చందాలు మాత్రం పూర్తిగా వసూలు చేసే బాధ్యత ఎమ్మెస్వోలు, ఆపరేటర్లమీద రుద్దటం, సిబ్బంది అలాంటి క్లిష్టపరిస్థితుల్లోనూ ఇంటింటికీ తిరగాల్సి రావటం అందరికీ తెలిసిందే. ఒకవైపు ప్రజలను ఇళ్ళలో ఉంచేలా నిరాటంకంగా ప్రసారాలు అందించాలని సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ తాఖీదు ఇవ్వటంతో ప్రాణాలు అరచేతిలొ పెట్టుకొని కేబుల్ రంగం శ్రమించాల్సి వచ్చింది.
అయినా సరే, కేబుల్ రంగంలో పనిచేసే వారిని ఫ్రంట్ లైన్ వారియర్లుగా గుర్తించలేదు. పోలీసులు, డాక్టర్లు, ఆశా కార్యకర్తల.. ఇలా ఎంతోమందిని కోవిడ్ యోధులుగా ప్రకటించి బీమా సౌకర్యం లాంటివి కల్పించి ధైర్యం ఇచ్చినా కేబుల్ రంగాన్ని ప్రభుత్వం పట్టించుకొలేదు. ఇప్పుడు సెకండ్ వేవ్ లో పరిస్థితి మరింత దారుణంగా మారినప్పుడు కూడా ప్రభుత్వం నిర్లక్ష్యంగానే వ్యవహరిస్తోంది.
ఫ్రంట్ లైన్ వారియర్స్ గా గుర్తించటం వలన బీమా సౌకర్యం లభిస్తే దానివలన ఏదైనా అనుకోని ఘటన జరిగితే కుటుంబానికి ఆసరా దొరుకుతుందని ఆశించారు. అలా జరగకపోగా, ఆ గుర్తింపు లేకపోవటం వలన ముమ్దు వరుసలో టీకాలు వేయించుకునే అవకాశాన్ని కూడా కేబుల్ రంగం లోని వారు కోల్పోయారు. ఎంతో ప్రమాదకరమైన వాతావరణంలొ పనిచేయాల్సిన కేబుల్ సిబ్బందికి కనీసం ముందుగా టీకాలు వేయటానికి కూడా ప్రభుత్వం అనుమతించకపోవటం చాలా దారుణం.
ఇటీవలి కాలంలో కరోనా సెకండ్ వేవ్ లో అనేకమంది కేబుల్ రంగం వారు ప్రాణాలు కోల్పోయారు. వృత్తి నిబద్ధతతో పనిచేసినందుకు వారు కరోనాబారిన పడ్డారు. అలాంటి కుటుంబాలు వీదినపడ్దాయి. లాక్ డౌన్ సమయంలొనూ ప్రసారాలు నిరంతరం సాగాలని ఆదేశాలిచ్చినవారు వీరి ప్రాణాలకు మాత్రం భరోసా ఇవ్వలేకపొయారు. కనీసం వారి కుటుంబాలను ఆదుకోవటానికైనా ముందుకు రావాల్సి ఉంది. తక్షణ ఆర్థిక సహాయం అందించటంతోబాటు కుటుంబంలో ఒకరికి ఉపాధి కల్పించటం చాలా అవసరం.
గతంలో కేంద్ర ప్రభుత్వం లాక్ డౌన్ విధించినప్పుడు అత్యవసర సేవలలో ప్రింట్, టీవీ మీడియాతోబాటు కేబుల్ రంగాన్ని, ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్లను చేర్చింది. కానీ తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్టాలు మాత్రం లాక్ డౌన్ / కర్ఫ్యూ మార్గదర్శకాలలో కేబుల్ రంగాన్ని ప్రస్తావించకపొవటం వలన విధుల నిర్వహణకు వీలుగా పోలీస్ శాఖా పాస్ లు జారీచేయలేకపోతోంది.
ఈ పరిస్థితుల్లో విధి నిర్వహణలో అసువులు బాసిన కేబుల్ రంగ సోదరులకు నివాళులు, వారి కుటుంబాలకు సానుభూతి, మొత్తంగా కేబుల్ రంగానికి సంఘీభావం తెలియజేయాల్సిన అవసరం ఉంది. అందుకే ఒక రోజు పగటి పూట ఉదయం 10 గంటలనుంచి సాయంత్రం 5 గంటలవరకు కేబుల్ టీవీ ప్రసారాలు నిలిపివేసి తమ ఆందోళను ప్రభుత్వాలతోబాటు ప్రజల దృష్టికి తీసుకురావాలని తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్టాల ఎమ్మెస్వోలు, ఆపరేటర్లు ఆలోచిస్తున్నారు. ఈ విషయమై రెండు రాష్ట్రాల ఐక్యకార్యాచరణ సమితి (జాయింట్ యాక్షన్ కమిటీ) నాయకులు సమావేశమై సంప్రదింపుల అనంతరం నిరసన కార్యక్రమం తేదీ తదితర వివరాలను ప్రకటించబోతున్నారు.

తెలుగు రాష్ట్రాల
MSO’S&LCO’S JAC
🙏🙏🙏🙏🙏

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here