జాతీయ స్థాయిలో 4వ రాంక్ నిలబెట్టుకున్న స్టార్ మా

0
512

బ్రాడ్ కాస్ట్ ఆడియెన్స్ రీసెర్చ్ కౌన్సిల్ (బార్క్) తాజాగా నవంబర్ 21-27 మధ్య వారానికి టీవీ ప్రేక్షకాదరణ సమాచారాన్ని విడుదలచేసింది. స్టార్ మా తెలుగులో తన మొదటి స్థానం కొనసాగించటంతోబాటు జాతీయ స్థాయిలో నాలుగో స్థానాన్ని కూడా నిలబెట్టుకుంది. స్థూలంగా ఈ వారం రేటింగ్స్ లో వెల్లడైన అంశాలు ఇలా ఉన్నాయి:
• జాతీయ స్థాయిలో అన్ని చానల్స్ లో స్టార్ మా చానల్ కు నాలుగో స్థానం
• జాతీయ స్థాయి పే చానల్స్ లో స్టార్ మా చానల్ కు మూడో స్థానం
• తెలుగులో స్టార్ మా (744068) కు తిరుగులేని మొదటి స్థానం
• తెలుగులో రెండో స్థానంలో ఉన్న జీ తెలుగు (491374) కంటే స్టార్ మా 50% ఎక్కువ
• జెమినీ టీవీ (304177), ఈటీవీ (408784) కలిసినా స్టార్ మా కంటే తక్కువ ఆదరణ
• అత్యుత్తమ కార్యక్రమాల జాబితాలో మొదటి ఐదు స్థానాలూ స్టార్ మా పరం
• తెలుగులో ఐదు అత్యుత్తమ కార్యక్రమాలూ స్టార్ మా సీరియల్సే
• తెలుగులో అత్యంత ప్రేక్షకాదరణ పొందిన సీరియల్ కార్తీక దీపం (13615)
• టాప్ 5 లో మిగిలిన సీరియల్స్ ఇంటింటి గృహలక్ష్మి (11,490), వదినమ్మ (9613), దేవత (8426), చెల్లెలి కాపురం (6603)
• కార్తీక దీపంలో సగం ఆదరణ కూడా సంపాదించలేకపోయిన ఇతర చానల్స్ కార్యక్రమాలు

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here