బార్క్ సీఈవో గా నకుల్ చోప్రా టీవీ ప్రేక్షకాదరణను లెక్కించే బ్రాడ్ కాస్ట్ ఆడియెన్స్ రీసెర్చ్ కౌన్సిల్ (బార్క్)

0
529

సీవో గా సునీల్ లల్లా స్థానంలో నకుల్ చోప్రా నియమితులయ్యారు. ఈ నియామకం ఆగస్టు 25 నుంచి అమలులోకి వస్తుంది. సొంత వ్యాపార ఆలోచనతో సునీల్ లల్లా తప్పుకోవాలని నిర్ణయించుకోవటంతో ఈ నియామకం అనివార్యమైంది. చోప్రా 2016 లో బార్క్ ఇండియా బోర్డులో చేరారు. ఆ తరువాత 2108 నుంచి 2019 దాకా సంస్థ ఛైర్మన్ గా, 2020 జనవరిలో ఓవర్ సైట్ కమిటీ సభ్యునిగా నియమితులయ్యారు. దాదాపు నాలుగుదశాబ్దాలపాటు మీడియా మార్కెటింగ్ రంగంలో ఉన్న చోప్రా పబలిక్స్ వరల్డ్ వైడ్ కు ఇండియా అండ సౌత్ ఏషియా సీ ఈ వో గా, త్రికయా గ్రే అడ్వర్టైజింగ్ లో ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ గా పనిచేసారు. అడ్వర్టయిజింగ్ ఏజెన్సీస్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా కు రెండేళ్ళపాటు అధ్యక్షునిగా కూడా బాధ్యతలు నిర్వహించారు. ఇప్పటికే బార్క్ లో భాగమై ఉండటం వలన సంస్థ అభివృద్ధికి చోప్రా మరింత కృషి చేసే అవకాశం ఉంటుంది. బార్క్ అనేక విమర్శలు ఎదుర్కుంటున్న నేపథ్యంలో శాంపిల్ సైజ్ పెంచటం, గ్రామీణ ప్రాంతాలకు తగినంత ప్రాధాన్యం ఇవ్వటం లాంటి చర్యలు తీసుకోవటంతో బాటు మసకబారుతున్న బార్క్ ప్రతిష్ఠను పెంచాల్సిన బాధ్యత కూడా చోప్రా మీద ఉంది. ఇటీవలి కాలంలో బార్క్ రేటింగ్స్ లో అక్రమాలకు అవకాశాలున్నట్టు తేలటం, చివరికి మాజీ సీ ఎఎ వో జైలు పాలవటం కూడా తెలిసిందే. ఆరు నెలలకు పైగా న్యూస్ ఛాన్సల్ రేటింగ్స్ ఆగిపోగా, పునరుద్ధరణకు చర్యలు తీసుకోవాల్సిన బాధ్యత కూడా చోప్రామీద ఉంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here