థోప్ టీవీ సీఈవో ను అరెస్ట్ చేసిన ముంబయ్ సైబర్ పోలీసులు

0
685

థోప్ టీవీ అనగానే అదేదో టీవీ చానల్ అనుకోవద్దు. అది అనేక ఒటిటి ల సమాహారం. పేరుమోసిన ఒటిటి లకు చందాలు కట్టాల్సిన పనిలేకుండా థోప్ టీవీ యాప్ ద్వారా వాటన్నిటిలో వచ్చే సినిమాలు, సిరీస్.. ఇలా అన్నీ ఉచితంగా చూసెయ్యవచ్చు. కాకపోతే పేర్లలో కొద్దిపాటి మార్పును అర్థం చేసుకుంటే చాలు. హాట్ స్టార్ బదులు వాట్ స్టార్, ఆహా కి బదులు ఓహో పేర్లతో వాటి కార్యక్రమాలన్నీ చూదవచ్చు. అమెజాన్, నెట్ ఫ్లిక్స్ లాంటి అంతర్జాతీయ ఒటిటి వేదికలు సహా అన్నీ ఒకే చోట ఉచితంగా అందించటం థోప్ టీవీ ప్రత్యేకత.

తెలంగాణలొని గుర్రంగూడకు చెందిన సతీశ్ వెంకటేశ్వర్లు అనే 28 ఏళ్ళ యువకుడి ఆలోచనా ఫలితం ఈ సూపర్ ఒటిటి. ఏదాదికి పైగా ఈ ప్రసారాలు అందుకుంటున్నవాళ్లు అనందిస్తున్నారు గాని అక్రమంగా ఇలా ఉచితంగా ఇవ్వటం వలన నష్టపోతున్న ఒటిటి సంస్థల యజమానులు ఊరికే వదిలెయ్యరు గదా. తమ నష్తాలకు కారణమైన థోప్ టీవీ మీద ఫిర్యాదు చేశారు. దీంతో ముంబయ్ సైబర్ సెల్ పోలీసులు ఎట్టకేలకు 13వ తేదీ మంగళవారం నాడు అరెస్ట్ చేసి తీసుకువెళ్ళారు.

ఐసిసి వరల్డ్ టెస్ట్ చాంపియన్ షిప్ ఫైనల్స్ కు ముందే స్టార్ ఇండియా ఈ ఫిర్యాదు దాఖలు చేసింది. సంస్థ యజమానికి తెలియకుండానే టీవీలోను, వీడియో ఆన్ డిమాండ్ రూపంలోను తమ సినిమాలు, కార్యక్రమాలు సీరియల్స్, షోస్, స్పోర్ట్స్ ఈవెంట్స్ అన్నిటినీ గుత్తగా ఉచితంగా అందించే ఆండ్రాయిడ్ సాఫ్ట్ వేర్ తో నష్టాలకు కారకుడవుతున్నాడంటీ కేసు పెట్టింది.

అదే విధంగా వయాకామ్ 18 మీడియా కూదా మహారాష్ట్ర సైబర్ పోలీసులకు ఇలాంటి ఫిర్యాదే చేసింది. ఈ యాప్ ఆండ్రాయిడ్, విండోస్, మాక్ లైనక్స్ పరికరాలలో సులభంగా లభిస్తోందని గుర్తించారు. దీన్ని డౌన్ లోడ్ చేసుకున్న కొంతమంది నేరుగా వెంకటేశ్వర్లు బ్యాంక్ ఖాతాలోకి దబ్బు జమ చేసినట్టు కూడా పోలీసులు గుర్తించారు.

స్పెషల్ ఐజి యశస్వి యాదవ్ నేతృత్వంలో ఎస్పీ సంజయ్ షింట్రే, ఇన్స్ పెక్టర్ అర్చనా సుతార్ తో కూడిన మహారాష్ట్ర సైబర్ నోడల్ సెల్ అధికారుల బృందం తెలంగాణకు వచ్చి వెంకటేశ్వర్లును అరెస్ట్ చేసింది. ఐటి చట్టంలోని వివిధ సెక్షన్లు, కాపీ రైట్ చట్టం, ఐపిసి లోని చీటింగ్ సెక్షన్ కింద కేసు రిజిస్టర్ చేసి కోర్టులో హాజరుపరచగా జులై 19 వరకు కోర్టు రిమాండ్ విధించింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here