ట్రాయ్ కొత్త టారిఫ్ ఆర్డర్ ప్రకారం ఎన్.సి.ఎఫ్ మార్చిన ఎమ్మెస్వోలు

0
582

దేశవ్యాప్తంగా ప్రధాన ఎమ్మెస్వోలు అందరూ టెలికామ్ రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండిఉయా (ట్రాయ్) జారీచేసిన రెండో టారిఫ్ ఆర్డర్ కు అనుగుణంగా తమ నెట్ వర్క్ కెపాసిటీ ఫీజు ( ఎన్ సి ఎఫ్ ) లో మార్పులు చేశారు. జిటిపిఎల్ హాత్ వే, డెన్ నెట్ వర్క్, హాత్ వే, కెసిసిఎల్, వికె డిజిటల్స్ తదితర సంస్థలు కొద్దికాలం కోర్టు తీర్పు కోసం ఆగినప్పటికీ, తాజా ఆదేశాలకు అనుగుణంగా నెట్ వర్క్ కెపాసిటీ ఫీజు లో మార్పులకు కట్టుబడుతున్నట్టు ప్రకటించాయి.

ఇప్పుడు తాజాగా హిందుజా గ్రూప్ వారి ఎన్ ఎక్స్ టి డిజిటల్,  ఫాస్ట్ వే ట్రాన్స్ మిషన్, కేరల విజన్ డిజిటల్ టీవీ కూడా అదే బాట పట్టాయి. ప్రధానంగా   ఒకటి కంటే ఎక్కువ కనెక్షన్లు ఉన్నవారికి రెండో కనెక్ష్జన్ నుంచి 40% మాత్రమే ఎన్ సి ఎఫ్ వసూలు చేసేలా ట్రాయ్ కొత్త నిబంధనలలో పేర్కొంది. అదే విధంగా నెట్ వర్క్ కెపాసిటీ ఫీజు కింద రూ.130 (పన్నులు అదనం) వసూలు చేస్తూ 100 చానల్స్ ఇవ్వాలనే నిబంధనను సవరించి ఉచితంగా 200 చానల్స్ ఇవ్వాలని చెప్పింది. పైగా రూ.160 చెల్లించే పక్షంలో అపరిమితంగా ఉచిత చానల్స్ ఇవ్వాలని కూడా ఆదేశించింది. ప్రభుత్వం తప్పనిసరిగా అందించాలనే దూరదర్శన్ చానల్స్ ఈ జాబితా పరిధిలోకి రావని కూడా చెప్పింది. ఈ నిబంధనలన్నిటినీ పాటించటానికి ప్రధాన ఎమ్మెస్వోలు అందరూ సిద్ధపడటం గమనార్హం. ఇలా ఉండగా తమిళనాడు ప్రభుత్వ ఆధ్వర్యంలోని అరసు కేబుల్ టీవీ రూ. 120 మాత్రమే నెట్ వర్క్ కెపాసిటీ ఫీజు కింద వసూలు చేస్తూ ఉండగా ఇప్పుడు అదే ధరకు అపరిమితంగా ఉచిత చానల్స్ ఇవ్వాలని నిర్ణయించింది. అదనపు కనెక్షన్ల విషయంలో ప్రతి కనెక్షన్ కూ  ఇందులో 40%  మాత్రమే తీసుకోవటానికి ఒప్పుకుంది. సిటీ కేబుల్, తమిళగ కేబుల్ టీవీ కమ్యూనికేషన్స్ ఈ జనవరిలోనే ట్రాయ్ కొత్త టారిఫ్ ఆర్డర్ ను అమలు చేయటం ప్రారంభించిన సంగతి తెలిసిందే.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here