రెండు తెలుగు రాష్ట్రాల్లో ముగ్గురు కొత్త ఎమ్మెస్వోలకు లైసెన్స్

0
529

సమాచార, ప్రసార మంత్రిత్వశాఖ జులై నెలలో 15 కొత్త ఎమ్మెస్వో లైసెన్సులు మంజూరు చేయగా అందులో రెండు తెలుగు రాష్ట్రాల లైసెన్సులు మూడు ఉన్నాయి. ఆగస్టు మొదటివారంలో విడుదల చేసిన తాజా జాబితా ప్రకారం ఇప్పటివరకు దేశవ్యాప్తంగా లైసెన్స్ పొందిన ఎమ్మెస్వోల సంఖ్య 1679 కు చేరింది.

ఈ ఏడాది జనవరి నుంచి జులై వరకు 48 ఎమ్మెస్వో లైసెన్సులు జారీ అయ్యాయి. ఎమ్మెస్వో లైసెన్సులన్నీ పదేళ్లపాటు అమలులో ఉంటాయి. మొదట్లో ఎమ్మెస్వో దరఖాస్తుదారులు తమ పరిధి ప్రకటించాల్సిన నియమం ఉండగా ఆ తరువాత దేశమంతటా వర్తించేలా మంత్రిత్వశాఖ ఒక సర్క్యులర్ జారీచేసింది.

జులై నెలలో రెండు తెలుగు రాష్ట్రాలకు చెందిన మూడు ఎమ్మెస్వో లైసెన్సులు జారీ అయ్యాయి. అందులో హైదరాబాద్ కు చెందిన యప్ టీవీ డిజిటల్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ కేబుల్ రంగంలో ప్రవేశానికి గుర్తుగా ఎమ్మెస్వో లైసెన్స్ తీసుకోవటం గురించి ఇప్పటికే కేబుల్ సమాచార్ రాసిన విషయం తెలిసిందే. లైసెన్స్ పొందిన మిగిలిన ఇద్దరిలో ఒకరు ఆంధ్రప్రదేశ్ లోని కర్నూలు జిల్లా  ఎమ్మిగనూరుకు చెందిన శివా కేబుల్ కమ్యూనికేషన్స్ అధిపతి మాచాని శివ శంకర్ కాగా, మరొకరు చిత్తూరు జిల్లా మదనపల్లెకు చెందిన ఇందు అండ్ మహదేవ్ బ్రాడ్ బాండ్ ప్రైవేట్ లిమిటెడ్.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here