ఎమ్మెస్వో లైసెన్స్ రెన్యూవల్, ఎన్ సి ఎఫ్ మీద ట్రాయ్ చర్చా పత్రం

0
887

బ్రాడ్ కాస్టర్లు, పంపిణీ నెట్ వర్క్స్ కు సంబంధించిన అనేక విషయాల మీద నియంత్రణకు నిబంధనలు రూపొందించే దిశలో ట్రాయ్ ప్రయత్నిస్తోంది. ఇందుకోసం ఒక చర్చాపత్రం విడుదల చేసి సంబంధితుల అభిప్రాయాలు తీసుకొని ట్రాయ్ తన సిఫార్సులను ప్రభుత్వానికి పంపుతుంది. ఈ చర్చా పత్రాన్ని వచ్చే 4-6 వారాలలో విడుదల చేసే అవకాశముంది.

ఇందులో ప్రధానంగా నెట్ వర్క్ కెపాసిటీ ఫీజు పరిమితి, ఒకటి కంటే ఎక్కువ టీవీలు ఉన్నప్పుడు టారిఫ్, చానల్ ధరలు లాంటి కీలక అంశాలున్నాయి. ఇటీవల పే చానల్స్ ధరలు పెంచినా, నెట్ వర్క్ కెపాసిటీ ఫీజులో మార్పు లేకపోవటం, కనీస చానల్స్ సంఖ్య పెంచటం కేబుల్ ఆపరేటర్లకు నష్టదాయకంగా మారిన సంగతి తెలిసిందే. అందుకే ఇప్పుడు వసూలు చేస్తున్న నెట్ వర్క్ కెపాసిటీ ఫీజు పెంచే సంగతి కూడా చర్చిస్తారు. అదే విధంగా, ఒకటి కంటే ఎక్కువ చానల్స్ ఉన్నప్పుడు టారిఫ్ ఎలా ఉండాలనేది కూడా మళ్ళీ ఇంకోసారి చర్చిస్తారు.

ఒక టీవీ చానల్ చందాకు కనీస చందా సమయం కూడా నిర్ణయించటానికి ఈ చర్చా పత్రంలో అభిప్రాయాలు తీసుకుంటారని తెలుస్తోంది. అదే విధంగా ఎమ్మెస్వోలు, లోకల్ కేబుల్ ఆపరేటర్లు భాష, అంశం వారీగా తాము అందించే చానల్స్ జాబితాను రూపొందించటం మీద కూడా చర్చిస్తారు. ఎమ్మెస్వోల లైసెన్స్ రెన్యూవల్ కు 10 సంవత్సరాల గడువు పెట్టాలని నిరుడు ఎంఐబి ని ట్రాయ్ కోరిన నేపథ్యంలో ఈ విషయం కూడా చర్చా పత్రంలో చేరుస్తారని భావిస్తున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here