3 ఆంధ్రప్రదేశ్ ఎమ్మెస్వో లైసెన్స్ దరఖాస్తులను త్రోసిపుచ్చిన ఎంఐబి

0
578

ఆంధ్రప్రదేశ్ కు చెందిన 3 డిజిటల్ ఎమ్మెస్వో లైసెన్స్ దరఖాస్తులను సమాచార, ప్రసార మంత్రిత్వశాఖ 2020 జులైలో త్రోసిపుచ్చింది. దరఖాస్తు ప్రాసెస్ చేయటానికి అవసరమైన లక్ష రూపాయలను చెల్లించటంలో విఫలమైనందున దరఖాస్తులను త్రోసిపుచ్చుతున్నట్టు మంత్రిత్వశాఖ తన వెబ్ సైట్ లో తెలియజేసింది. త్రోసిపుచ్చిన దరఖాస్తుల వివరాలు ఇలా ఉన్నాయి:

  1. శ్రీ షిర్డీ సాయి కేబుల్ నెట్ వర్క్ (యజమాని శ్రీ బొజ్జా యోగేశ్వరరెడ్డి), టీచర్స్ కాలనీ, లక్కిరెడ్డిపల్లి, కడప జిల్లా, ఆంధ్రప్రదేశ్ – 516257, దరఖాస్తు చేసిన తేదీ 18.10.2019, త్రోసిపుచ్చిన తేదీ  24.07.2020
  2. రవి డిజిటల్స్ ( యజమాని బిలకుర్తి రవి కుమార్) పల్లపువీధి, నాగులపల్లి, యు. కొత్తపల్లి మండలం, తూర్పు గోదావరి జిల్లా – 533447, ఆంధ్రప్రదేశ్,  దరఖాస్తు చేసిన తేదీ 20.02.2019, త్రోసిపుచ్చిన తేదీ  31.07.2020
  3. శ్రీ రామ్ డిజిటల్ కేబుల్ నెట్ వర్క్ ( యజమాని రాయచోటి సుబ్రమణ్యం) వడ్డె కాలనీ, బాచుంపల్లి, పాలెంపల్లి, కడప – 516003, ఆంధ్రప్రదేశ్, దరఖాస్తు చేసిన తేదీ 17.10.2019 త్రోసిపుచ్చిన తేదీ 31.07.2020

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here