కర్నాటక కేబుల్ ఆపరేటర్ల సంఘం నూతన భవన ప్రారంభోత్సవం

0
761

కర్నాటక రాష్ట్ర కేబుల్ టీవీ ఆపరేటర్ల సంఘం ఈ నెల 24 న బుధవారం తమ కొత్త కార్యాలయభవనాన్ని ప్రారంభిస్తోంది. కర్నాటక రాష్ట్ర హోం శాఖామంత్రి శ్రీ రామలింగారెడ్డి, సమాచార, ప్రజాసంబంధాల శాఖామంత్రి శ్రీ సిసి పాటిల్, భారత కేబుల్ ఆపరేటర్ల సమాఖ్య అధ్యక్షురాలు శ్రీమతి రూప్ శర్మ ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా హాజరవుతారు.
బెంగళూరులోని కోరమంగళ కె హెచ్ బి కాలనీలో 24న ఉదయం 11.30 గంటలకు జరిగే ఈ నూతన కార్యాలయ భవన ప్రారంభోత్సవానికి హాజరుకావాలని వివిధ రాష్ట్రాల ఎమ్మెస్వోలు, కేబుల్ ఆపరేటర్ల సంఘాలకు కర్నాటక రాష్ట కేబుల్ అపరేటర్ల సంఘం అధ్యక్షుడు శ్రీ వి ఎస్ పాట్రిక్ రాజు విజ్ఞప్తి చేశారు.
బెంగళూరు నగరంలో విద్యుత్ స్తంభాలకు, చెట్లకు వేలాడుతున్న కేబుల్స్ విషయంలో హైకోర్టు కూడా జోక్యం చేసుకున్న నేపథ్యంలో గతవారమే ఈ సంఘం ఆ రాష్ట్ర ముఖ్యమంత్రిని కలిసి కేబుల్ ఆపరేటర్ల కేబుల్స్ కు, బ్రాడ్ బాండ్ ఆపరేటర్ల కేబుల్స్ కు తేడా గుర్తించి కేబుల్ ఆపరేటర్లకు న్యాయం చేయాలని విజ్ఞప్తి చేసింది. ముఖ్యమంత్రి కూడా ఈ విజ్ఞప్తికి సానుకూలంగా స్పందించారు.
కేబుల్ ఆపరేటర్లు ఒక్కో ప్రాంతంలో ఇద్దరు లేదా ముగ్గురు కంటే ఎక్కువ లేకపోగా కొన్ని కార్పొరేట్ సంస్థలు, బ్రాడ్ బాండ్ పంపిణీ సంస్థలు ఇటీవలి కాలంలో పెద్ద ఎత్తున కేబుల్స్ వేయటం వల్లనే అసలు సమ్స్య్స్ద వచ్చిందన్న విషయామ్మి రాష్ట్ర కేబుల్ ఆపరేటర్లు ప్రభుత్వం దృష్టికి తెచ్చారు, ఇప్పుడు హోంమంత్రిని, సమాచార ప్రజాసంబంధాల శాఖామంత్రిని ఆహ్వానించటం ద్వారా ఈ సమస్యను నేరుగా వారికి విన్నవించే అవకాశాన్ని వాడుకుంటున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here