మనం మరచిన మన సైన్యం గురించి హిస్టరీ టీవీ18 లో ప్రత్యేక కార్యక్రమం

0
457

మొదటి ప్రపంచ యుద్ధం ప్రారంభమైన 1914 తొలినాళ్ళలో బ్రిటిష్ సైనికులకు అండగా పోరాడేందుకు దాదాపు 13 లక్షలమంది భారత సైనికులను నౌకలకెక్కించి పంపటం మొదలుపెట్టారు. వాళ్ళలో 75,000  ఆ పోరాటంలో యుద్ధ క్షేత్రంలోనే మరణైంచి మళ్లీ తిరిగి రాలేదు. అరుదైన ఆనాటి దృశ్యాలను మన కళ్ళ ముందుకు తెస్తూ, ప్రత్యక్ష సాక్షులు, అమరుల బంధువుల మాటలు రికార్డు చేస్తూ అద్భుతమైన పరిశోధనతో రూపొందించిన గంట నిడివి గల డాక్యుమెంటరీ మొట్టమొదటి ప్రపంచ సంగ్రామంలో భారతీయుల పాత్రను మన కళ్ళకు కట్టేలా  ఉంటుంది. ఆ విధంగా మనం మరచిపోయిన మన వీరుల త్యాగాన్ని చరిత్రకెక్కించే ప్రయత్నమిది.

1918లో తుపాకుల శబ్దం మూగబోయిన తరువాత ఈ తొలి ప్రపంచయుద్ధం ముగిసింది. ఈ మహాయుద్ధం తరువాత ఇక యుద్ధమే ఉండకపోవచ్చుననుకున్నారు. ఇందులో ఇరుపక్షాలకూ చెందిన వివిధ దేశాల సైనికులు లక్షలాది మంది పాల్గొని మరణించారు. కానీ విదేశీ గడ్దలమీద పోరాటానికి వెళ్ళిన భారత సైనికుల గురించి బాహ్య ప్రపంచానికే కాదు, భారతీయులకూ తెలిసింది చాలా తక్కువ. . పార్లమెంట్ సభ్యుడు, ఒకప్పుడు ఐక్యరాజ్య సమితిలో ఉన్నత పదవిలో ఉన్న శశి థరూర్ మాటల్లో చెప్పాలంటే ” వాళ్ళ మహోన్నత త్యాగం చరిత్రలో రికార్డు కాలేదు. మొత్తం బ్రిటిష్ సామ్రాజ్యంలో మరే దేశమూ ఇంతగా సైనికులను కోల్పోలేదు. దానికసలు ఎంతమాత్రమూ ప్రాధాన్యం ఇవ్వకపోవటం దురదృష్టకరం” భారత విస్మృత సైన్యం (India’s Forgotten Army) పేరుతో రూపొందించిన ఈ డాక్యుమెంటరీ ఆగస్టు 15న ( ఈ శనివారం)  రాత్రి 9 గంటలకు హిస్టరీ టీవీ18 లో ప్రసారమవుతుంది. భారత సైనికుల త్యాగాలను చూపటానికి వాళ్ళ వారసులను, ఆనాటి ఆనవాళ్ళను పట్టి మనకందించే ప్రయత్నం అందులో కనబడుతుంది. ఎలాంటి పరిస్థితుల్లో భారతీయులను వాడుకున్నారు, ఆ యుద్ధంతో నైనా మనకు స్వాతంత్ర్యం ఇస్తారన్న నమ్మకంతో త్యాగాలకు ఒడిగట్టినవాళ్ళు అప్పట్లో (దాదాపు వందేళ్ళ కిందట) తమ బంధుమిత్రులకు రాసిన లేఖల ఆధారంగా రూపొందించిన ఈ దృశ్యకావ్యం కచ్చితంగా చూసి తీరాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here