సుప్రీంకోర్టుకు వెళ్ళిన బ్రాడ్ కాస్టర్లు

0
735

మొత్తానికి అనుకున్నదే అయింది. బొంబాయ్ హైకోర్టు తీర్పు మీద బ్రాడ్ కాస్టర్లు సుప్రీంకోర్టుకు వెళ్లారు. పే చానల్స్ ధరల మీద టెలికామ్ రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా (ట్రాయ్) ఆంక్షలు విధిస్తూ జారీచేసిన రెండో టారిఫ్ ఆర్డర్ (ఎన్టీవో 2.0) కు బొంబాయ్ హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇవ్వటంతో సుప్రీంకోర్టులో ఊరట దొరకవచ్చునన్న ఆశతో ఈరోజు ( జులై 14న) సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. వచ్చేవారం ఇది లిస్ట్ అవుతుందని భావిస్తున్నారు.
రాజ్యాంగంలోని ఆర్టికిల్ 19(2) కు బొంబాయ్ హైకోర్టు సరైన భాష్యం చెప్పలేదని బ్రాడ్ కాస్టర్ల సంఘమైన ఇండియన్ బ్రాడ్ కాస్టింగ్ ఫౌండేషన్ (ఐబిఎఫ్) ఈ పిటిషన్ లో వాదించింది. భావప్రకతనాస్వేచ్ఛను ఒక్కో స్థాయిలోఫ్ ఒక్కో విధంగా పరిగణిస్తున్నారని అభ్యంతరం చెప్పింది. బ్రాడ్ కాస్టింగ్ పరిశ్రమ వ్యాపార హక్కును కాలరాస్తూ ధరలను నియంత్రిస్తున్నారని పేర్కొంది.

ట్రాయ్ చెప్పిన దాన్ని బొంబాయ్ హైకోర్ట్ గుడ్డిగా ఆమోదించిందని, ట్రాయ్ ఇచ్చిన వివరణపూర్వకమైన మెమొరాండమ్ లో అంశాలను సరిగా అధ్యయనం చేయలేదని, అసలు ట్రాయ్ వాదనకు ఏదైనా ప్రాతిపదిక ఉన్నదా అనే విషయం కూడా చూదలేదని ఆ పిటిషన్ లో ఐబిఎఫ్ పేర్కొంది. గరిష్ఠ చిల్లర ధరను రూ.19 నుంచి 12 కు తగ్గించటానికి అసలు ఎలాంటి ప్రాతిపదికాలేదని ఆ పిటిషన్ లో పేర్కొంది.

బొకే తయారీమీద ఆంక్షలు పెట్టటంలో హేతుబద్ధతను ట్రాయ్ చెప్పలేకపోయిందని కూడా ఐబిఎఫ్ ఆరోపించింది. ప్రధాన టారిఫ్ ఆర్డర్ లో లేకపోయినప్పటికీ బొకేల విషయంలో జంట షరతులను మళ్లీ ప్రవేశపెట్టిందని కూడా తప్పుపట్టింది. బొంబాయ్ హైకోర్టులో ట్రాయ్ కి వ్యతిరేకంగా టారిఫ్ ఆర్డర్ ను సవాలు చేసినవారిలో ఐబిఎఫ్ తోబాటు ఫిల్మ్ అండ్ టీవీ ప్రొడ్యూసర్స్ గిల్డ్, స్టార్ ఇండియా, జీ ఎంటర్టైన్మెంట్ ఎంటర్ ప్రైజెస్, వయాకామ్ 18. సోనీపిక్చర్స్ నెట్ వర్క్స్ ఇండియా ఉన్నాయి. 1997 నాటి ట్రాయ్ చట్టంలోని సెక్షన్ 11 కు రాజ్యాంగ బద్ధత లేదని, ఎన్టీవో 1.0, ఎన్టీవో 2.0 చెల్లబోవని ఈ సంస్థలు బొంబాయ్ హైకోర్టులో వాదించాయి

ఈ మూడింటినీ రాజ్యాంగ వ్యతిరేకమైనవిగా గుర్తించి రద్దు చేయాలని బ్రాడ్ కాస్టర్లు కోరారు. అయితే, ఎన్టీవో 2.0 లోని జంట షరతులలో రెండవ అంశాన్ని తప్ప మూడు అంశాలనూ బొంబాయ్ హైకోర్ట్ సమర్థించింది. దీంతో తప్పనిసరిగా పే చానల్ ధరలు తగ్గించాల్సిన పరిస్థితి ఏర్పడటంతో సుప్రీంకోర్టులో ఊరట పొందటానికి ఇప్పుడు తాజాగా పిటిషన్ దాఖలు చేశారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here