కేబుల్ టీవీ నియంత్రణమీద భారీగా స్పందించిన తెలుగు రాష్ట్రాలు

0
600

ఎమ్మెస్వోలు, కేబుల్ ఆపరేటర్లు నడిపే కేబుల్ చానల్స్ ను నియంత్రించటానికి ట్రాయ్ తలపెట్టిన నిబంధనలమీద తెలుగు రాష్ట్రాలనుంచి భారీ స్పందన వచ్చింది. డిజిటల్ ఎమ్మెస్వోల సంఘం తోబాటు కార్పొరేట్ ఎమ్మెస్వోలు రిలయెస్న్ జియో, హాత్ వే, సిటీ నెట్ వర్క్స్, డెన్ లాంటివి, సోనీ, టైమ్స్ నెట్ వర్క్ లాంటి బ్రాడ్ కాస్టర్లు, ఏకైక హిట్స్ ఆపరేటర్ అయిన ఎన్ ఎక్స్ టి డిజిటల్ స్పందించటం సహజమే అయినా, ఈ సారి తెలుగు రాష్ట్రాలనుంచి ఆపరేటర్లు, ఎమ్మెస్వోలు బాగా స్పందించారు.
ఎమ్మెస్వోల వైపు నుంచి బ్రైట్ వే మేనేజింగ్ డైరెక్టర్ సుభాష్ రెడ్ది ఒక్కో అంశం మీద వివరంగా వ్యాఖ్యానిస్తూ అభ్యంతరాలను స్పష్టంగా తెలియజేశారు. అదే విధంగా సీమాంధ్ర కేబుల్ ఆపరేటర్ల సంక్షేమ సంఘం కూడా ఆపరేటర్ల సమస్యలను ప్రస్తావిస్తూ ట్రాయ్ ప్రతిపాదనలలో కొన్ని అంశాలను తప్పుబట్టింది. చానల్స్ వైపు నుంచి టీవీ 5 యాజమాన్య సంస్థ శ్రేయ బ్రాడ్ కాస్టింగ్ ప్రైవేట్ లిమిటెడ్ తన అభిప్రాయం వ్యక్తం చేసింది. ఇక ఆపరేటర్ల విషయానికొస్తే లక్సెట్టిపేట సిటి కేబుల్ నెట్వర్క్, పాలకొల్లు కేబుల్ నెట్ వర్క్, శ్రీ కన్య కేబుల్ నెట్ వర్క్ (నర్సీపట్నం), టిసిసి కేబుల్ కమ్యూనికేషన్ ( తాడేపల్లి గూడెం), పాలమూర్ డిజిటల్ మీడియా (మూసాపేట్-మహబూబ్ నగర్ జిల్లా) తమ అభ్యంతరాలు, అభిప్రాయాలు తెలియజేశారు.
దేశవ్యాప్తంగా చానల్స్, ఎమ్మెస్వోలు, డిటిహెచ్ ఆపరేటర్లు, డిటిహెచ్, హిట్స్ ఆపరేటర్లు, బ్రాడ్ కాస్టర్లు, కొందరు వ్యక్తులు కలిసి మొత్తం 30 స్పందనలు రాగా ఇందులో తెలుగు రాష్ట్రాలనుంచే 9 ఉండటం గమనార్హం. కేబుల్ రంగంతో ప్రత్యక్ష సంబంధం లేని ముగ్గురు పరిశీలకులు ఈ నియమాలమీద వ్యాఖ్యానించగా అందులో హైదరాబాద్ నుంచి తోట భావనారాయణ ఉన్నారు.
కేబుల్ చానల్స్ మీద నియంత్రణ తెచ్చే లక్ష్యంతో ట్రాయ్ గతంలో కొన్ని సిఫార్సులు చేయగా అందులో కొన్నిటిని ఒప్పుకుంటూ, మరి కొన్నింటికి మార్పులు సూచిస్తూ సమాచార, ప్రసార మంత్రిత్వశాఖ మళ్ళీ ట్రాయ్ కి పంపింది. దీంతో అభిప్రాయాలు సేకరించేందుకు ట్రాయ్ డిసెంబర్ 7న చర్చాపత్రం విడుదలచేసింది. కేబుల్ చానల్స్ ను కాపాడుకోవటానికి ఈ అవకాశాన్ని వాడుకోవాలని కోరుతూ బ్రైట్ వే కమ్యూనికేషన్స్ ఎండీ, తెలంగాణ ఎమ్మెస్వోల సమాఖ్య అధ్యక్షుడు శ్రీ సుభాష్ రెడ్డి ఒక నమూనా ను కూడా రూపొందించి కేబుల్ ఆపరేటర్లకు పంపిణీ చేయటంతో ఆపరేటర్ల గొంతు ట్రాయ్ కి వినిపించేట్టు చేయటం సాధ్యమైంది.

ట్రాయ్ చర్చాపత్రం మీద వెల్లడైన అభిప్రాయాలకోసం ఈ లింక్ క్లిక్ చేయండి: https://trai.gov.in/consultation-paper-mib-back-reference-trais-recommendations-dated-19112014-regulatory-framework

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here