కేబుల్ టీవీ దినోత్సవ శుభాకాంక్షలు!

0
570

కేబుల్ రంగంలో దాదాపు మూడు దశాబ్దాలుగా ఆవిశ్రాంతంగాకృషి చేస్తున్న సోదరులకు కేబుల్ టీవీ దినోత్సవం సందర్భంగా శుభాకాంక్షలు. ఇంటింటికీ వినోదం పంచుతూ, వార్తా సమాచారం అందిస్తూ, లోకల్ కేబుల్ చానల్స్ ద్వారా స్థానిక విషయాలకు ప్రాధాన్యమిస్తూ ఎండనకా, వాననకా పనిచేస్తున్న కేబుల్ రంగంలోని వారందరూ మనం ఇప్పటిదాకా ఉన్న తీరును, ప్రస్తుత సందర్భంలో అనుసరించాల్సిన వ్యూహాలను గుర్తు చేసుకోవటం ఈ సందర్భంగా అవసరం. ముందుగా ఈ వర్షాకాలంలో అప్రమత్తంగా ఉండాలని, కేబుల్ వేయటానికో, సారి చేయటానికో కరెంట్ స్తంభం ఎక్కే వాళ్ళు, ఇతర టెక్నీషియన్లు చాలా జాగ్రత్తగా ఉండాలని పడే పడే విజ్ఞప్తి చేస్తూనే ఉన్నాను. వధి నిర్వహణ ముఖ్యమే అయినయం ప్రాణాలు అంతకంటే ముఖ్యమనే విషయం గుర్తుంచుకోవాలి. వర్షాకాలంలో డీటీహెచ్ సరిగా పనిచేయకపోవటం వలన కేబుల్ టీవీకి అదొక ప్రచార అస్త్రంగా పనిచేసే మాట నిజమే. కానీ సర్వీస్ ఇచ్చే విషయంలో అజాగ్రత్త మాత్రం పనికిరాదు.అదే విధంగా ఇప్పుడు బ్రాడ్ బాండ్ ద్వారా ఆదాయం పెంచుకోవటానికి ప్రయత్నించాల్సిన అవసరముంది. డిజిటైజేషన్ వలన ఆదాయం తగ్గిందని బాధపడటం కంటే కొత్త మార్గాలతోఈ భవిష్యత్తుకోసం కృషి చేయటం చాలా ముఖ్యం. అనేక మంది సర్వీస్ ప్రొవైడర్లు ఇప్పుడు కేబుల్ ఆపరేటర్ల ద్వారా బ్రాడ్ బాండ్ వ్యాపారం చేయటానికి ముందుకొస్తున్నారు. ఈ అవకాశాన్ని వాడుకోవటానికి ఆపరేటర్లు ముందుకు రావాలి. కొత్త టెక్నాలజీలమీద అవగాహన పెంచుకున్నప్పుడే వ్యాపారంలో నిలబడే వీలుంది. అందుకే టెక్నాలజీని మన దగ్గరికి తెచ్చే కేబుల్ నెట్ ఎక్స్ పో ఎఎ నెల 27 నుంచి హైదరాబాద్ హైటెక్స్ లో జరగబోతున్నది. ఎక్విప్ మెంట్ సంస్థలు, రకరకాల హార్డ్ వేర్, సాఫ్ట్ వేర్ సంస్థలు ప్రదర్శించే టెక్నాలజీని తెలుసుకోండి. ప్రదర్శనతో బాటు జరిగే సెమినార్లలో చర్చించే విషయాలతో నాలెడ్జ్ పెంచుకొని లాభదాయకమైన నిర్ణయం తీసుకోండి. అనేకమంది సర్వీస్ ప్రొవైడర్లు చెప్పే మాటలు, వాళ్ళిచ్చే ఆఫర్లు తెలుసుకోండి. అనుమానాలు తీర్చుకోండి. కేబుల్ రంగంలోని వారికి పునర్జన్మనిచ్చే సదవకాశాన్ని వాడుకోవటానికి, మీకు పనికొచ్చే మార్గాన్ని ఎంచుకోవటానికి ఇది చక్కటి అవకాశం. కేబుల్ టీవీ దినోత్సవం సందర్భంగా మరోమారు శుభాకాంక్షలు చెబుతూ, మీ సుభాష్ రెడ్డి. ఎండీ, బ్రైట్ వే కమ్యూనికేషన్స్ అధ్యక్షుడు, తెలంగాణ ఎమ్మెస్వోల సమాఖ్య

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here