ఆంధ్ర, తెలంగాణ చందాదారులే జిటిపిఎల్ లక్ష్యం

0
1537

కోవిడ్ సంక్షోభం కారణంగా ఒక్క సారిగా పెరిగిన ఒటిటి ఆదరణ ప్రభావం కేబుల్ టీవీని దెబ్బతీస్తుందన్న అనుమానాల మధ్య జిటిపిఎల్ హాత్ వే మాత్రం వచ్చే మూడళ్ళలో తన చందాదారుల సంఖ్యను 50% పెంచుకోవటాన్ని లక్ష్యంగా పెట్టుకుంది. ఆ విధంగా మొత్తం కనెక్షన్లను కోటీ 20 లక్షలకు చేరుకోవాలని భావిస్తోంది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణతో బాటు త్రిపురలో ఏటా 60,000 నుంచి 70,000 దాకా కనెక్షన్లు పెరుగుతాయని అంచనా వేస్తున్నట్టు సంస్థ ప్రకటించింది.
ఈ మూడేళ్ళ లక్ష్యాన్ని సాధించటం కోసం జిటిపిఎల్ హాత్ వే ద్విముఖ వ్యూహాన్ని అనుసరించబోతోందని సంస్థ చీఫ్ స్ట్రాటెజీ ఆఫీసర్ పీయూష్ పంకజ్ వెల్లడించారు. ఇప్పటిదాకా ఏవేవే పథకాలు ప్రకటిస్తూ చందాదారులను, కేబుల్ ఆపరేటర్లను ఆకట్టుకునే ప్రయత్నం చేశామని, ఇకముందు చందాదారులే స్వయంగా ఎంచుకునేలా ప్రకటనల మీద ఆధారపడాలనుకుంటున్నామని చెప్పారు. డిటిహెచ్ వైపు వెళ్ళిపోయిన వాళను మళ్లీ వెనక్కి తీసుకురావటనికి తొలి ప్రాధాన్యమిస్తామన్నారు. డిటిహెచ్ నుంచి కేబుల్ వైపు వచ్చే పే టీవీ చందాదారులకు నేరుగా ప్రోత్సాహకాలు అందిస్తామని పంకజ్ వివరించారు.
జిటిపిఎల్ కరోనా సంక్షోభం ప్రారంభానికి ముందే “ చత్రీ హఠావో-జిటిపిఎల్ లగావో “ అనే ప్రచారం ప్రారంభించి మళ్ళీ ఆగస్టు-అక్టోబర్ లో పండుగ సీజన్ లో కూడా ప్రచారాన్ని పునరుద్ధరించటాన్ని గుర్తు చేశారు. ఇప్పుడు ఈశాన్య రాష్టాల్లోనూ ఇదే నినాదాన్ని అమలు చేయబోతున్నట్టు వివరించారు. స్పందన చాలా బాగా ఉండటంతో త్వరలో దేశవ్యాప్తంగా అమలు చేయాలని జిటిపిఎల్ హాత్ వే భావిస్తోంది.
తమ పరిధిలో మూడున్నర నుంచి నాలుగు కోట్ల చందాదారులు మాత్రమే ఉండటంతో 6 కోట్ల డిటిహెచ్ చందాదారులను, మరో 6 కోట్ల కేబుల్ చందాదారులను లక్ష్యం చేసుకొని సాగాలని అనుకుంటున్నట్టు పంకజ్ చెబుతున్నారు. అదే సమయంలో టీవీలు లేని 13 కోట్ల ఇళ్ళను కూడా లక్ష్యంగా చేసుకుంటామన్నారు. కేబుల్ టీవీలో ఇంకా చాలా అవకాశాలున్నాయని మరింతమందిని ఆకట్టుకోవటానికి బ్రాడ్ బాండ్ వ్యాపారాన్ని కూడా పెద్ద ఎత్తున జోడిస్తామన్నారు.
వచ్చే ఏడాదికి రూ.300 కోట్ల పెట్టుబడి పెట్టాలని జిటిపిఎల్ హాత్ వే భావిస్తోంది. అందులో సగానికి పైగా బ్రాడ్ బాండ్ మీద, రూ.130 నుంచి 140 కోట్ల వరకు కేబుల్ టీవీ మీద ఖర్చు చేయబోతోంది. ప్రస్తుతం ఈశాన్య భారతంతోబాటు తమిళనాడులోనూ అడుగుపెట్టగా ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో బలపడటానికి ప్రయత్నిస్తోంది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, త్రిపుర మార్కెట్లనుంచి ఏటా 60-70 వేల కనెక్షన్లు సొంతం చేసుకోవాలన్న ఆలోచనలో ఉంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here