రూ. 400 కోట్ల పెట్టుబడికి సిద్ధమైన జిటిపిఎల్

0
2124

దేశవ్యాప్తంగా కేబుల్ టీవీ కార్యకలాపాలు నిర్వహిస్తున్న ఎమ్మెస్వో జీటీపిఎల్ హాత్ వే ఈ ఆర్థిక సంవత్సరంలొ రూ. 400 కోట్లు పెట్టుబడి పెట్టాలని నిర్ణయించుకుంది. నిరుడు రూ. 335 కోట్లు మాత్రమే పెట్టుబడి పెట్టగా ఈ సారి దాదాపు 20% పెంచటం విశేషం. ఇప్పుడు పెట్టే రూ.400 కోట్లలో దాదాపు 225-230 కోట్ల మేరకు బ్రాడ్ బాండ్ రంగం మీదనే వెచ్చిస్తారు. మిగిలినది కేబుల్ వైపు వెళుతుంది. అది కూడా కొత్త మార్కెట్లలో విస్తరించటానికి ఖర్చు చేస్తారు. అంతర్గతంగా రావాల్సిన నిధులనుంచే ఈ పెట్టుబడి పెడతారు. ప్రస్తుతానికి బయటి నుంచి నిధులు సేకరించే ఆలోచన లేదని సంస్థ చీఫ్ స్ట్రాటెజీ ఆఫీసర్ పీయూష్ పంకజ్ వెల్లడించారు.
ఇంతకుముందే జిటిపిఎల్ హాత్ వే తన కేబుల్ టీవీ చందాదారుల సంఖ్యను వచ్చే మూడేళ్ళలో 50 % పైగా పెంచుకోవటానికి పథక రచన చేస్తున్నట్టు వెల్లడించింది. 2021 లో పెరుగుదల లేకపోయినప్పటికీ, దానికి కారణం వాణిజ్యపరమైన కనెక్షన్లు తగ్గటమే దానికి కారణమని సంస్థ విశ్లేషించింది. హోటళ్ళు, కార్పొరేట్ కార్యాలయాలు, ఇతర ఆఫీసులు, చిన్న చిన్న వ్యాపార సంస్థలు, కార్యాలయాలు కోవిడ్ కారణంగా కనెక్షన్లు కట్ చేయటమే అందుకు కారణమని పేర్కొంది. కరోనా సమయంలో అదనంగా 5 లక్షల ఇళ్ళకు చేరుకోగలిగినట్టు చెబుతూ, ఈ పెరుగుదల ఇలాగే కొనసాగుతుందని ధీమా వ్యక్తం చేశారు.
బ్రాడ్ బాండ్ కనెక్షన్ల పెరుగుదల మీద కూడా జిటిపిఎల్ ఆశాభావంతో ఉంది. దాదాపు ఒక్కో త్రైమాసికానికి 60,000 ఉంటుందని అంచనా. 2020 మార్చి 31న ఐ ఎస్ పి ఇంటర్నెట్ సర్వీస్ రూ. 5 కోట్లు కాగా అది 2021 లో రూ.43 కోట్లకు చేరింది. ఒక్కో త్రైమాసికానికి కొంత నిరాశాజనకంగా కనబడినా, ఏడాది మీద ఏడాది పోల్చుకున్నప్పుడు మాత్రం పది రెట్లు ఎక్కువ నమోదు చేసుకుందని జిటిపిఎల్ హాత్ వే ప్రమోటర్, ఎండి అనిరుధ్ సింహ్ జడేజా ప్రస్తావించారు. బ్రాడ్ బాండ్ మీద సగటు ఆదాయం పెంచుకోవటం మీద కంటే, కేబుల్ లో బాగా బలంగా ఉన్న గుజరాత్ లాంటి మార్కెట్ లో బ్రాడ్ బాండ్ ను విస్తరించటం మీదనే ప్రస్తుతం దృష్టిసారిస్తున్నామన్నారు. లాన్ నుంచి ఎఫ్ టిటిహెచ్ కి స్థాయి పెంచే కొద్దీ, సగటు ఆదాయం పెరుగుతుందని అంచనావేస్తున్నారు. ఈ తరహా మార్పు నిరుడు కనబడిందని, అదే వేగం కొనసాగుతుందని భావిస్తున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here