ఇండియా టుడే గ్రూప్ నుంచి ‘మంచి వార్తల చానల్’

0
207

ఇండియా టుడే గ్రూప్ ఒక సరికొత్త న్యూస్ చానల్ ప్రారంభిస్తోంది. ఈ నెల 5 న ప్రారంభమయ్యే ఈ చానల్ పేరు “గుడ్ న్యూస్ టుడే” . “వార్తలు మారవు, కానీవాటిని మనం చూసే కోణంలోనే మార్పు ఉంటుంది” అనేది ఈ గ్రూప్ ఆలోచన. ప్రపంచంలో మంచిని చూస్తూ ఆ మంచిని పది మందికి పంచుతూ మంచి ఆలోచనలను ప్రోత్సహించాలన్నది ఈ చానల్ ప్రారంభానికి దారితీసింది. దుర్వార్త లోనూ ఒక నిర్మాణాత్మక అంశం ఉంటుందన్నదే దీనికి ప్రేరణ. ఆశను పెంచి, మానవ విజయాన్ని వేడుకగా జరుపుకుంటూ, సరికొత్త ఆలోచనలకు, నవకల్పనలకు ప్రోత్సాహమిస్తూ అన్నీ రంగాల వారినీ, అన్నీ ప్రాంతాలవారినీ పరిచయం చేయటం ద్వారా అందరిలో ఉత్సాహం రేకిత్తించాలన్నది ఛానల్ ఆలోచన. మంచి వార్తే అసలైన వార్త అనే భావనతో మంచిని పెంచే వార్తలతో ప్రేక్షకులందరినీ ఒక్కటి చేయాలని ఇండియా టుడే గ్రూప్ భావిస్తోంది. చుట్టూ ఉన్న దృక్పథాన్ని మార్చటానికి ఇండియా టుడే కట్టుబడి ఈ గుడ్ న్యూస్ టుడే చానల్ ని ప్రారంభిస్తోంది. ఎక్కడ మంచి జరిగినా, ఎక్కడ ప్రోత్సహించాల్సిన అవసరం కనిపించినా అక్కడ ఈ చానల్ ప్రత్యక్షమవుతుంది. సమాజంలో మంచితనాన్ని చూపిస్తూ అందరూ మంచిని ఆచరించేలా చేయటానికి కృషి చేస్తామని చెబుతూ చానల్ ప్రారంభిస్తున్నారు. సకారాత్మక వార్తలతో మనుషులలో ఆలోచనలు కూడా సానుకూలంగా ఉండేట్టు చేయాలన్న ప్రయత్నానికి శ్రీకారం చుడుతోంది. 1975 లో మొదలైన ఇండియా టుడే మేగజైన్ నాణ్యమైన జర్నలిజం అవసరాన్ని చాటి చెప్పింది. టేపులు, వీడియోలు మొదలైన కాలంలోనే న్యూస్ ట్రాక్, ఆజ్ తక్ లాంటి కార్యక్రమాలతో దూరదర్శన్ లో ప్రవేశించి ఆ తరువాత దేశంలో అత్యంత ప్రతిష్ఠాత్మక న్యూస్ చానల్ ఆజ్ తక్ ను అందించింది. ఇప్పుడు డిజిటల్ కాలంలో అంతా మొబైల్ లోనే అంటున్న సమయంలో ఈ సరికొత్త చానల్ ఆవిష్కరించటం ద్వారా అందరి ఆలోచనా ధోరణిని ఈ గుడ్ న్యూస్ టుడే మార్చుతుందని ఆశించవచ్చు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here