జూన్ 9 లోగా డిజిటల్ వేదికల సమాచారం ఇవ్వాలి

0
613

అన్ని రకాల డిజిటల్ మాధ్యమాలూ తమ సమాచారాన్ని జూన్ 9 లోగా సమర్పించాలని సమాచార, ప్రసార మంత్రిత్వశాఖ ఆదేశించింది. ఐటి చట్టంలో భాగంగా 2021 ఫిబ్రవరి 25న డిజిటల్ మీడియా నైతిక సూత్రాల మీద రూపొందించిన మార్గదర్శకాలను ఈ సందర్భంగా సమాచార, ప్రసార మంత్రిత్వశాఖ గుర్తు చేసింది.
అనైతికమైన, అసభ్యకరమైన ప్రసారాంశాలను నియంత్రించటానికి వీలుగా సమాచారాన్ని సేకరిస్తున్నట్టు మంత్రిత్వశాఖ మే 26 నాటి ఈ నోటిఫికేషన్ లో పేర్కొంది. ప్రెస్ అండ్ రిజిస్ట్రేషన్ ఆఫ్ బుక్స్ చట్టం కింద పత్రికలు, సమాచార, ప్రసార మంత్రిత్వశాఖ అప్ లింకింగ్, డౌన్ లింకింగ్ మార్గదర్శకాలకు అనుగుణంగా శాటిలైట్ చానల్స్ ఇప్పటికే అనుమతి పొంది ఉంటాయి గనుల అవి అనుబంధం -1 నింపి పంపాలని సూచించింది.
అయితే, ఇతర డిజిటల్ న్యూస్ వేదికలు అనుబంధం -2 లో సమాచారం అందజేయాలని, ఒటిటి వేదికలు అనుబంధం 3 లో సమాచారం ఇవ్వాలని ఎం ఐ బి నోటిఫికేషన్ పేర్కొంది. ఈ నోటిఫికేషన్ వెలువడిన 15 రోజుల్లోగా, అంటే జూన్ 9 లోగా సమాచారం సమర్పించాల్సి ఉంటుంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here