ఎక్స్ ప్రెస్ టీవీ లైసెన్స్ రద్దు

0
753

తెలుగు న్యూస్ చానల్ ఎక్స్ ప్రెస్ టీవీకి న్యూస్, కరెంట్ ఎఫైర్స్ విభాగం కింద ఇచ్చిన అప్ లింకింగ్, డౌన్ లింకింగ అనుమతిని సమాచార, ప్రసార మంత్రిత్వశాఖ ఉపసంహరించుకుంది. ఈ మేరకు ఈరోజు (డిసెంబర్ 17న) మంత్రిత్వశాఖ అందరు ఎమ్మెస్వోలకు, ఆలిండియా డిజిటల్ కేబుల్ ఫెడరేషన్ కు లేఖరాసింది. అనుమతించిన చానల్స్ జాబితా నుంచి ఎక్స్ ప్రెస్ టీవీ పేరును కూడా తొలగించింది.
అందరు ఎమ్మెస్వోలు, కేబుల్ ఆపరేటర్లు ఈ చానల్ ప్రసారాలను నిలిపివేయాలని, దీన్ని పాటించని పక్షంలో కేబుల్ టీవీ చట్టం కింద చర్యలు తీసుకుంటామని ఆ లేఖలో హెచ్చరించింది.
నిజానికి ఎక్స్ ప్రెస్ టీవీ ప్రసారాలు నిలిచిపోయి రెండేళ్ళు దాటింది. ఆ తరువాత కొద్ది నెలలకే దాని యజమాని డాక్టర్ జయరామ్ హత్యకు గురయ్యారు. నిబంధనలు ఉల్లంఘించిన ఆరోపణలమీద ఎక్స్ ప్రెస్ టీవీ మీద లేబర్ కోర్టులో కేసు కూడా నడుస్తోంది. చానల్ పెట్టటం కోసం లైసెన్స్ ఆలస్యం కాకుండా ఉండటానికి వీలుగా అప్పటికే ఎక్స్ ప్రెస్ టీవీ పేరుతో లైసెన్స్ ఉన్న జె ఎస్ డి డేటా ఇన్ఫోటెక్ ప్రైవేట్ లిమిటెడ్ అనే సంస్థను జయరామ్ కొనుగోలు చేశారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here