ఈటీవీ, జెమినీ కలిసి స్టార్ మా తో సమానం

0
846

తెలుగు జనరల్ ఎంటర్టైన్మెంట్ చానల్స్ లో  స్టార్ మా తన తిరుగులేని ఆధిక్యాన్ని చాటుకుంటు వస్తోంది. జాతీయ స్థాయిలో నాలుగో స్థానంలో ఉన్న సన్ టీవీకి సమానస్థాయికి ఎదిగింది. తెలుగులో రెండో రాంకులో ఉన్న  జీ తెలుగు దాదాపు 38% తక్కువ స్థాయిలో ఉండగా, ఈటీవీ, జెమినీ టీవీ ప్రేక్షకాదరణ  కలిసి స్టార్ మా తో సమానం కావటం కూడా  స్టార్ ఆధిక్యపు స్థాయిని తెలియజేస్తోంది.

రాంకు   చానల్             వీక్షణలు (వేలల్లో) 

1              స్టార్ మా          804366

2              జీ తెలుగు         509680

3              ఈటీవీ తెలుగు   442931

4              జెమిని టీవీ       306598

కార్యక్రమాల విషయానికొచ్చినా స్టార్ మా ఆధిక్యం ఎంతమాత్రమూ తగ్గలేదు. అన్ని ఎంటర్టైన్మెంట్ చానల్స్ లోనూ టాప్ 5 కార్యక్రమాల స్థానాలను మా టీవీ సీరియల్స్ మాత్రమే ఆక్రమించుకోవటం విశేషం. కార్తీక దీపం (15484), ఇంటింటి గృహలక్ష్మి (11813), వదినమ్మ (10375), దేవత (8076), చెల్లెలి కాపురం (7064) వరుసగా ఐదు రాంకులు సాధించుకున్నాయి. అయితే జబర్దస్త్ గాని, బిగ్ బాస్ గాని మొదటి ఐదు స్థానాల్లో లేకపోవటం విశేషం.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here