విదేశీ మారకద్రవ్యం: బీబీసీ మీద ఈడీ కేసు

0
349

విదేశీ మారకద్రవ్య నిబంధనలు ఉల్లంఘించిందన్న ఆరోపణ మీద న్యూస్ బ్రాడ్ కాస్టర్ బీబీసీ ఇండియా మీద ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ (ఈదీ) కేసు నమోదు చేసింది. విదేశీ మారకద్రవ్య నిర్వహణ చట్టం ( ఫెమా) కింద కేసు నమోడు చేసినట్టు తెలుస్తోంది. ఆ సంస్థలోకి వచ్చిన విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల మీద దర్యాప్తు జరుగుతుందని చెబుతున్నారు.
ఫిబ్రవరిలో ఢిల్లీ, ముంబయ్ లోని బీబీసీ కార్యాలయాలలో ఐటీ దాడులు జరిపిన తరువాత ఈడీ ఈ విధంగా కేసు పెట్టాలని నిర్ణయం తీసుకుంది. మూడు రోజులపాటు జరిపిన దాడులు, సోదాల అనంతరం ప్రభుత్వం వివరాలతో ఒక ప్రకటన విడుదల చేసింది అందులో బీబీసీ పేరు ప్రస్తావించకుండానే ప్రభుత్వం ఆ సంస్థ నిర్వహణలో వశూలయిన కొన్ని మొత్తాల మీద పన్ను చెల్లించకపోవటాన్ని గుర్తించినట్టు పేర్కొంది.
“ఆదాయ పన్ను చట్టం 1961 లోని సెక్షన్ 133 ఏ కింద ఒక ప్రముఖ అంతర్జాతీయ మీడియా కంపెనీకి చెందిన ఢిల్లీ, ముంబయ్ కార్యాలయాలలో సోదాలు జరిగాయి. ఆ సంస్థ ఇంగ్లిష్, హిందీతోబాటు వివిధ భారతీయ భాషలలో కంటెంట్ తయారీ, ప్రకటనల అమ్మకం, మార్కెట్ అనుబంధ సేవలు చేపడుతోంది.” అని ఆ ప్రకటనలో పేర్కొంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here