10 లక్షల చందాదారులను పోగొట్టుకున్న డీటీహెచ్

0
1320

టెలికామ్ రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా ( ట్రాయ్) తాజాగా విడుదల చేసిన సమాచారం ప్రకారం డీటీహెచ్ 10 లక్షల చందాదారులను కోల్పోయింది. మూడు నెలలకాలంలో 6 కోట్ల 99 లక్షల నుంచి 6 కోట్ల 89 లక్షలకు డీటీహెచ్ కనెక్షన్లు తగ్గినట్టు ట్రాయ్ అధికారికంగా ప్రకటించింది. ఈ సంఖ్యకు డీడీ ఫ్రీడిష్ కనెక్షన్లు అదనం.
ఇప్పుడున్న నాలుగు ప్రధాన డీటీహెచ్ ల మార్కెట్ వాటా గమనిస్తే టాటా స్కై 33.34%, భారతీ టెలీమీడియా ( ఎయిర్ టెల్) 26.11%, డిష్ టీవీ ఇండియా (22.65%), సన్ డైరెక్ట్ 17.91% ఉన్నాయి. భారతీ టెలీమీడియా, సన్ డైరెక్ట్ వాటా కాస్త పెరగటం, టాటా స్కై, డిష్ టీవీ వాటా కొంత తగ్గటం కూడా అంతకు ముందు మూడు నెలలలో పోల్చినప్పుడు నమోదైంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here