బ్రాడ్ బాండ్ వ్యాపారంలోకి డీటీహెచ్ ఆపరేటర్లు

0
456

రానున్న కాలంలో బ్రాడ్ బాండ్ వ్యాపారానికే ఉజ్జ్వల భవిష్యత్తు ఉంటుందని గ్రహించిన డీటీహెచ్ ఆపరేటర్లు కూడా ఇప్పుడు ఆ వ్యాపారంలో అడుగు పెడుతున్నారు. ఇప్పటిదాకా బ్రాడ్ బాండ్ సర్వీస్ ఇవ్వలేకపోవటం డీటీహెచ్ కి ఉన్న ప్రధానమైన లోటుగా పరిగణిస్తుండగా ఆ లోటు భర్తీ చేసుకోవటానికి డీటీహెచ్ ఆపరేటర్లు రంగంలోకి దిగటం గమనార్హం. దీంతో కేబుల్ ఆపరేటర్లు తమకున్న నెట్ వర్క్ ను మరింత సద్వినియోగం చేసుకునే అవకాశం కూడా వచ్చింది.
తాజాగా టాటా స్కై సంస్థ తాను బ్రాడ్ బాండ్ వ్యాపారంలో అడుగుపెడుతున్న విషయాన్ని అధికారికంగా ప్రకటించింది. మహారాష్ట్ర నవనిర్మాణ కేసుల సేన కు ఈ మేరకు లేఖ రాస్తూ తాము బ్రాడ్ బాండ్ వ్యాపారంలో చేరటానికి ఇప్పటికే టెలికమ్యూనికేషన్ల శాఖ నుంచి ఐఎస్పీ లైసెన్స్ కూడా తీసుకున్న విషయాన్ని ప్రస్తావించింది.
తమ వ్యాపారంలో కేబుల్ టీవీ యాజమానులను, ఆపరేటర్లను భాగస్వాములుగా చేర్చుకొని వారి ద్వారా ఇంటింటికీ చేరే అవకాశాలను పరిశీలిస్తున్నట్టు కూడా అ లేఖ లో పేర్కొంది. ఈ విధమైన పంపిణీకి నాన్- ఎక్స్ క్లూజివ్ ప్రాతిపదికన మాత్రమే ఆపారేటర్లను గుర్తిస్తామని స్పష్టం చేసింది. బేరసారాల అనంతరం పరస్పర ఆమోదయోగ్యమైన షరతుల ప్రకారం వ్యాపార లావాదేవీలు ఉంటాయని రాసింది.
అదే విధంగా బ్రాడ్ బాండ్ సేవలను తన డీటీహెచ్ కి అనుబంధంగా కొనసాగించబోతున్నట్టు పరోక్షంగా చెబుతూ ఎయిర్ టెల్ సంస్థ ఎయిర్ టెల్ బ్లాక్ పేరుతో మొబైల్, డీటీహెచ్, ఫైబర్ కనెక్షన్ ఉమ్మడిగా ఇవ్వబోతున్నట్టు ప్రకటించింది. అయితే, ఇది మాత్రం కేబుల్ ఆపరేటర్ సేవలు వినియోగించుకోబోతున్నట్టు చెప్పకపోవటం గమనార్హం. తన ప్రకటనను ఇప్పటికీ వీడియో రూపంలో మార్కెట్లోకి పంపింది. ఆ వీడియీ ఈ లింక్ లో చూడవచ్చు.
https://youtu.be/nc_LWG485s4
మొత్తంగా చూసినప్పుడు డీటీహెచ్ ఆపరేటర్లు కూడా బ్రాడ్ బాండ్ ప్రాధాన్యాన్ని గుర్తించారని స్పష్టమవుతోంది. టాటా స్కై స్థానిక కేబుల్ ఆపరేటర్లకు ఫ్రాంచైజీ ఇచ్చే ఆలోచనలో ఉండగా ఇప్పటి మొబైల్, బ్రాడ్ బాండ్, డీటీహెచ్ నడుపుతున్న ఎయిర్ టెల్ మాత్రం అన్నీ కలిపి తానే ఇచ్చేమదుకు సిద్ధమవుతోంది. ఇప్పటికైనా బ్రాడ్ బాండ్ ప్రాధాన్యం స్థానిక కేబుల్ ఆపరేటర్లకు అర్థమైతే ఫైబర్ టు ద హోమ్ తో బ్రాడ్ బాండ్ వ్యాపారానికి సిద్ధమవుతారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here