కొత్త ఐపీ అడ్రస్ లకు మారటానికి గడువు డిసెంబర్ 2022

0
787

ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్లు నెట్ వర్క్ లను కస్టమకయిజ్ చేయటానికి కస్టమర్ల ఆవరణలో మోడెమ్, రౌటర్ మార్చటానికి ఇంటర్నెట్ ప్రోటోకాల్ అడ్రస్ ఐపీవీ6 కి మారటానికి 2022 డిసెంబర్ ను గడువుగా నిర్ణయించినట్టు టెలికమ్యూనికేషన్ల విభాగం ప్రకటించింది. ఈ మేరకు ఒక ప్రకటన విడుదలచేసింది. అదే విధంగా ప్రభుత్వ సంస్థలకు ఆ గడువును 2022 జూన్ 30 గా నిర్ణయించినట్టు కూడా పేర్కొంది. ఇంటర్నెట్ కు అనుసంధానమైన వివిధ పరికరాలను గుర్తించటానికి ఐపీ అడ్రస్ ఉపయోగపడుతుంది.
టెలికమ్యూనికేషన్ల విభాగం 2010 లోనూ 2012 లోనూ మొదటి, రెండవ రోడ్ మ్యాపులు విడుదలచేసి ఐపీవీ 6 అడ్రస్ లకు మార్గనిర్దేశం చేసింది. ఐపీవీ 4 హయాంలో ఐపీ అడ్రస్ లకు 300 కోట్ల పరిమితి ఉంది. కానీ ఇప్పుడు తాజా మార్పు వలన అనేక కోట్ల ట్రిలియన్ల అడ్రస్ లు అందుబాటులో ఉంటాయి. ఇటీవలి కాలంలో ఇంటర్నెట్ వినియోగం భారీగా పెరగటంతో అనుసంధానమయ్యే పరికరాల సంఖ్య విపరీతంగా పెరుగుతూ వస్తోంది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఐపీవి6 ఆడ్రస్ ల సంఖ్యలో 50 శాతం భారతదేశంలోనే ఉండటం గమనార్హం.
ఐపీవి6 కు మారటం వలన ఇప్పుడు పెరిగిన వర్క్ ఫ్రమ్ హోమ్ నేపథ్యంలో ఇంటర్నెట్ వాడకం విపరీతంగా పెరుగుతుంది. అదే విధామహా ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్, త్వరలో రానున్న 5జి సేవల వలన కూడా ఈ అవసరాలు చాలా పెరుగుతాయి. ఐపీ అడ్రస్ లు చాలా ఎక్కువగా కావాల్సి వస్తాయి. అంతే కాకుండా, ఐపీవి6 వలన నెట్ వర్క్ సెక్యూరిటీ కూడా బాగా పెరుగుతుంది. ఐపీవి6 అడ్రస్ లు పెరగటం వలన భారత్ తన భౌగోళిక సరిహద్దుల్లోపలే తన స్వంత సురక్షితమైన నెట్ వర్క్ ను, స్వంత రూట్ సర్వర్లను సృష్టించుకోగలుగుతుంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here