తెలుగులో డిస్నీ+ హాట్ స్టార్

0
578

వినోదప్రియులకు విందు చేస్తూ డిస్నీ+ హాట్ స్టార్ తెలుగులో పెద్దన ఎత్తున రంగప్రవేశం చేస్తోంది. భారీ సినిమాలు, కార్యక్రమాలతోబాటు క్రీడా ప్రసారాలు కూడా అందజేస్తోంది. తాజా తెలుగు సినిమాలు అందించటం ద్వారా ప్రేక్షకులను పెద్ద ఎత్తున ఆకట్టుకోవటానికి ప్రయత్నిస్తోంది. ఈ ప్రారంభోత్సవానికి ప్రముఖ టాలీవుడ్ నటుడు రామ్ చరణ తేజ ముఖ్య అతిథిగా హాజరై ఏడాదిపాటు చూపటానికి వీలైనన్ని కార్యక్రమాలు సిద్ధంగా ఉన్నాయంటూ, దాని నినాదం “మన వినోద విశ్వం” అని చెప్పారు. ఈ కార్యక్రమంలో నాగార్జున, తమన్నా, నితిన్ తదితరులు కూడా పాల్గొన్నారు.

అందరు ప్రముఖ తెలుగు నటుల బ్లాక్ బస్టర్ చిత్రాలు చూవుతూ అత్యంత నాణ్యమైన కార్యక్రమాలను జోడించి తెలుగుప్రజాల వినోద దాహాన్ని తీర్చటానికి సిద్ధమైనట్టు సంస్థ ప్రకటించింది. అదే విధంగా వీవీ ఐపీఎల్ 2021 , ఐసీసీ మెన్స్ టి 20 వరల్డ్ కప్ 2021 తెలుగులో చూసే అవకాశం కూడా కల్పిస్తుంది. భారత ప్రజల ఆకాంక్షలు తెలుసునని, అదే విధంగా తెలుగు ప్రజల అభిరుచులు కూడా బాగా తెలియటం వలన తెలుగు వినోద రంగంలోకి ప్రవేశిస్తున్నామని డిస్నీ+ హాట్ స్టార్ అధిపతి సునీల్ రాయన్ చెప్పారు. మేస్ట్రో, అననబెల్లె సేతుపతి లాంటి బ్లాక్ బాస్టర్లను అందిస్తున్నామన్నారు. స్థానికంగా ప్రజాదరణ ఉండే కార్యక్రమాలు రూపొందించటం ద్వారా ప్రేక్షకులను మరింతగా ఆకట్టుకోవాలనే లక్ష్యంతో సాగుతున్నామన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here