కేబుల్ ఆపరేటర్ లారా… ఇది మీకు తెలుసా.

0
2032

కేబుల్ వ్యవస్థ లోకల్ కేబుల్ ఆపరేటర్ తో పుట్టి 25 సంవత్సరాలు గడుస్తుంది. లోకల్ కేబుల్ ఆపరేటర్ తో ఆరంభమైన ఈ వ్యవస్తాలోనికి మొదటగా ఏమ్మేస్వోలు రావడం జరిగింది. ఆ తర్వాత మెల్లి మెల్లిగ వివిధ ఛానల్స్ ఆ తర్వాత ప్రభుత్వాలు సైతం ఈ రంగం లోనికి రావడం జరిగింది.
కాని నాటికీ నేటికి ఏనాటికి కూడా కేబుల్ ఆపరేటర్ ద్వారానే అతి తక్కువ ధరకు కేబుల్ సిగ్నల్ అందించేది కేవలం కేబుల్ ఆపరేటర్ మాత్రమే.
కేబుల్ డిజిటైజేషన్ అయిన తర్వాత వంద మంది వున్న ఏమ్మేస్వో లు కేంద్ర ప్రభుత్వ నియమ నిబందనల వల్ల 10 మంది ఏమ్మేస్వోలకు పడిపోయారు .కాని కేబుల్ వ్యవస్తలో కేబుల్ ఆపరేటర్ మాత్రం అక్కడే వున్నారు. డిజిటైజేషన్ ప్రక్రియ వచ్చినా ఆపరేటర్ల సంఖ్య మాత్రం తగ్గలేదు. టెలివిజన్ వున్నన్ని రోజులు కేబుల్ ఆపరేటర్ వుంటాడు అన్నది సత్యం.
కాని కొంత మంది కేబుల్ ఆపరేటర్స్ అవగాహనా లోపంతో మల్టీ ఏమ్మేస్వోల సిగ్నల్ ని తీసుకుంటున్నారు. ప్రస్తుతం మల్టీ ఏమ్మేస్వో ఒక బాక్స్ కి 60 రూపాయల నుండి 100రూపాయలను వసూలు చేస్తున్నారు. అంతే కాకుండా వారు పెట్టిన నియమ నిబధనలు కఠీనంగ ఉన్నాయి. ముందు ఒక మాట చెప్పి మల్లి ఆమాట పై మల్టీ ఏమ్మేస్వో లు నిలబడటం లేదు. ఈ విషయాలు ప్రతి కేబుల్ ఆపరేటర్ కి తెలిసినవే. ప్రస్తుతం ఆ మల్టీ ఏమ్మేస్వోలకి బాక్స్ ప్రకారం బిల్లులు చెల్లిస్తే ఆపరేటర్ కి ఏమి ఆదాయం రాదు ఆ విషయం కూడా తెలిసిందే.
• అంతే కాదు మల్టీ ఏమ్మేస్వో దగ్గర మొదట మాట్లాడిన వ్యక్తీ ఆ తర్వాత అక్కడ కనిపించడు. పాత విషయాలు చర్చించాలి అంటే తమకు సంబంధం లేదు అన్నట్లుగా వ్యవహరిస్తారు .
• మల్టీ ఏమ్మేస్వో ల ప్రణాళిక భారత దేశ ప్రకారం రేట్ ను ఫిక్స్ చేస్తారు. కాని మన ఇండి విసువల్ ఏమ్మేస్వో మాత్రం మన ప్రాంత పరిస్తితులను బట్టి రేట్ ఫిక్స్ చేస్తారు.
• మల్టీ ఏమ్మేస్వో ల యజమాని ఎవరో కేబుల్ ఆపరేటర్స్ కి తెలుస్తుందా?
• మల్టీ ఏమ్మేస్వోలు మొదట లోకల్ చానల్స్ నడిపించుకోవచ్చు అంటారు. ఆ తర్వాత లోకల్ చానల్స్ ని తీసివేస్తారు.
• ధన దాహానికి అలవాటు పడ్డ మల్టీ ఏమ్మేస్వోలు మన ప్రాంతీయ న్యూస్ చానల్స్ ని ఎలాంటి ముందస్తు సమాచారం లేకుండా నిర్దాక్షిన్యంగా నిలుపుదల చేస్తారు. అంతే కాకుండా పాత టెక్నాలజీ ద్వార సిగ్నల్స్ ని అందిస్తున్నారు.
• మల్టీ ఏమ్మేస్వోలు ఎదో ఒక బ్రాడ్ కాస్టర్, డి.టి.హెచ్ కి సంబందించిన వ్యక్తులే భాగస్వాములై వుంటారు.
• ప్రస్తుత పరిస్తితుల్లో మల్టీ ఏమ్మేస్వో, డి.టి.హెచ్ సంస్థలు, బ్రాడ్ కాస్టర్లు, కేంద్ర ప్రభుత్వాలు కలిసి కేబుల్ ఆపరేటర్లను కూకటివేళ్ళతో పెకిలించాలని చూస్తున్నారు.
దయచేసి కేబుల్ ఆపరేటర్ లారా మీరు ఒక్కసారి ఆలోచించి ఇండివిసువల్ ఏమ్మేస్వోలకు మద్దతు తెలపండి. ఏమ్మేస్వోలతో ఏవైన మనస్పర్ధలు వుంటే పరిష్కారం చేసుకొని సిగ్నల్స్ ని పొందగలరు.
కేబుల్ ఆపరేటర్ మరియు ఇండి విసువల్ ఏమ్మేస్వోలు ఒకే వేదిక పైకి వచ్చి మన వ్యాపారాన్ని కాపాడుకోవాల్సిన అవసరం ఎంతైనా వుండి. మన వ్యాపారం మూడు పువ్వులు ఆరు కాయలుగా వెలుగొందాలని ఆశస్తూ ….
మీ ….
ఎం .సుభాష్ రెడ్డి.
తెలంగాణ డిజిటల్ ఎం.ఎస్.ఓ ఫెడరేషన్ అద్యక్షుడు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here