ట్రాయ్ టారిఫ్ ఆర్డర్ కారణంగా చానల్స్ ధరలు, బొకే ధరలు బాగా పెరిగిన సంగతి తెలిసిందే. అయితే, మనం దీన్ని వ్యతిరేకిస్తున్న కారణంగా డిస్నీ-స్టార్, జీ, సోనీ , కలర్స్ సహా కొంతమంది బ్రాడ్ కాస్టర్లు మన నెట్ వర్క్ తోబాటు అనేక నెట్ వర్క్స్ కు వాళ్ళ చానల్ సిగ్నల్స్ నిలిపివేసే అవకాశముంది. మనకే కాకుండా హాత్ వే, జీటీపీఎల్, ఎన్ ఎక్స్ టి డిజిటల్, డెన్, ఫాస్ట్ వే లాంటివి కూడా ఇలాంటి నిలిపివేతను ఎదుర్కుంటాయి. చందాదారులకు అందుబాటు ధరల్లో టీవీ ప్రసారాలు అందజేయాలనే లక్ష్యంతో దేశంలోని పెద్ద పెద్ద నెట్ వర్క్స్ కూడా ఈ ధరల పెరుగుదలను గట్టిగా వ్యతిరేకిస్తున్నాయి. అందువలన డిస్ కనెక్షన్ జరిగినా మీరు గట్టిగా నిలబడి సహకరించాలని కోరుతున్నాం. మనం మన మనుగడ కోసం, మన భవిష్యత్తుకోసం, చందాదారుల మేలు కోసం చేస్తున్న పోరాటమిది. మీకేదైనా అనుమానం ఉంటే మీ డిస్ట్రిబ్యూటర్ ను సంప్రదించండి.
