డిడి ఫ్రీడిష్ ఇప్పుడు 4 కోట్ల ఇళ్ళలో

0
870

ప్రసార భారతి వారి ఉచిత డిటిహెచ్ వేదిక డిడి ఫ్రీడిష్ ఇప్పుడు దేశవ్యాప్తంగా 4 కోట్ల ఇళ్లలో పనిచేస్తోంది. 2021 సంవత్సరానికి భారత వాణిజ్య మండలుల సమాఖ్య (ఫిక్కీ) రూపొందించిన నివేదిక ఈ సమాచారాన్ని స్పష్టంగా తెలియజేసింది. టీవీ సెట్ల ధర తక్కువ కావటంతో ఇంతకుముందు టీవీలు లేనివాళ్ళు కూడా టీవీలు కొనుక్కోవటం, మిగిలిన డిటిహెచ్, కేబుల్ కనెక్షన్లకు నెలవారీ చందాలు చెల్లించాల్సి రావటం. ఈ మధ్య దూరదర్శన్ ప్రారంభించిన డిడి రెట్రో ద్వారా అనేక పేరుమోసిన పాత డిడి కార్యక్రమాలు ప్రసారం కావటం లాంటి అనేక కారణాలు ఫ్రీడిష్ ఎదుగుదలకు దారితీశాయి.
అదే విధంగా టీవీలో చెప్పుకోదగిన కార్యక్రమాలేవీ లేని సమయంలో వాడుకునేలా కొన్ని ఇళ్లలో డిడి ఫ్రీడిష్ అదనంగా ఉండటం కూదా గమనించారు. ఇటీవలి కాలంలో చైనా నుంచి చిప్ సెట్స్ దిగుమతి లేకపోవటంతో కావాల్సినంత అందుబాటులో లేవని, ఉంటే ఈ సంఖ్య మరింత పెరిగేదని భావిస్తున్నారు. ఇకమీదట కూడా ఫ్రీడిష్ ఇదే విధమైన ఎదుగుదలను ప్రదర్శిస్తుందని, ఇప్పుడు 4 కోట్ల స్థాయిలో ఉన్న కనెక్షన్లు 2025 నాటికి 5 కోట్లకు చేరతాయని ఫిక్కీ అంచనావేసింది.
ప్రస్తుతం ఫ్రీడిష్ లో 161 చానల్స్ వస్తుండగా అందులో 91 దూరదర్శన్ చానల్స్ (విద్యా చానల్స్ సహా) తో బాటు 70 ప్రౌవేట్ శాటిలైట్ చానల్స్, 48 రేడియో చానల్స్ ఉన్నాయి. ఏప్రిల్ 1 నుంచి డిడి ఫ్రీడిష్ లో 10 హిందీ జనరల్ ఎంటర్టైన్మెంట్ చానల్స్, 15 హిందీ సినిమా చానల్స్, 6 మ్యూజిక్ చానల్స్, 20 న్యూస్ చానల్స్, ఎనిమిది భోజ్ పురి చానల్స్, మూడు ఆధ్యాత్మిక చానల్స్, రెండు విదేశీ చానల్స్ వస్తున్నాయి. ఇప్పుడే దాని స్థాయి పెంచే పని సాగుతుండగా మే నెలకల్లా మరికొన్ని చానల్స్ జోడయ్యే అవకాశాలున్నాయి. ఇటీవల రూపొందించిన ఒక యాప్ సాయంతో ప్రజలు తమకు దగ్గర్లో ఫ్రీడిష్ డీలర్ అడ్రస్ తెలుసుకునే అవకాశం ఉంది.
డిడి ఫ్రీడిష్ ఎప్పటికప్పుడు తన చానల్స్ సంఖ్యను పెంచుకుంటూ వస్తోంది. 2018 డిసెంబర్ లో 80 చానల్స్ ఉండగా 2019 డిసెంబర్ నాటికి 104 కు, 2020 డిసెంబర్ నాటికి 161 కు పెరిగాయి. స్టార్ ఇండియా, వయాకామ్ 18 మీడియా, జీ ఎంటర్టైన్మెంట్, సోనీ సంస్థలు ఈ వేదికమీద తమ చానల్స్ ను చూపుతున్నాయి. 48 శాటిలైట్ రేడియో చానల్స్ ప్రసారం కూడా ఆకాశవాణికి ప్రత్యేకత తెచ్చిపెట్టాయి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here