మీడియా చదువులకు ఉమ్మడి ప్రవేశ పరీక్ష

0
571

దేశంలో మొట్టమొదటి సారిగా యూనివర్సిటీ స్థాయి మీడియా చదువులకు ఉమ్మడి ప్రవేశ పరీక్ష జరుపుతున్నారు. జాతీయ స్థాయిలో దాదాపు 30 విశ్వవిద్యాలయాలలో ప్రవేశానికి ఈ ఉమ్మడి పరీక్ష జరుపుతున్నారు. ఆలిండియా మీడియా కామన్ ఎంట్రన్స్ టెస్ట్ పేరుతో ఈనెల 14 న గ్లోబల్ మీడియా ఎడ్యుకేషన్ కౌన్సిల్ మార్గదర్శనంలో ఎడిన్ బాక్స్ డాట్ కామ్ సఁస్థ వర్చువల్ పద్ధతిలో ఈ పరీక్ష నిర్వహిస్తోఁది. ఇఁదులో ఎఁ యు ఐ టి (నోయిడా), ఆదమాస్ యూనివర్సిటీ (కోల్ కతా), ఉత్తరాఁచల్ యూనివర్సిటీ ( డెహ్రాడూన్), జాగరణ్ లేక్ యూనివర్సిటీ (భోపాల్), అజీఁక్యా డివై పాటిల్ యూనివర్సిటీ (పూణె), మోదీ యూనివర్సిటీ (రాజస్థాన్), తదితర యూనివర్సిటీలున్నాయి.
దేశవ్యాప్తంగా ఈ యూనివర్సిటీలలో జర్నలిజఁ, మాస్ కమ్యూనికేషన్ తదితర మీడియా కోర్సులలో ప్రస్తుత విద్యాసంవత్సరం లోనే చేరాలనుకునేవారు ఈ ప్రవేశ పరీక్ష రాయవచ్చు. ప్రస్తుతం గ్రాడ్యుయేషన్ కోర్సులకే ప్రవేశం ఉన్న, వచ్చే ఏడాది నుంచి పోస్ట్ గ్రాడ్యుయేషన్ కోర్సులకు కూడా ప్రవేశాలుంటాయి.
ఈ ఏడాది ఆరంభంలో ఏర్పాటు చేసిన గ్లోబల్ మీడియా ఎడ్యుకేషన్ లో విద్యావేత్తలు, సీనియర్ వృత్తి నిపుణులు మీడియా నిపుణులను తీర్చిదిద్దుతున్నారు. ప్రత్యేకాంశాలలో బోధనకు కూడా మీడియా నిపుణులను వినియోగించు కుంటున్నారు. ప్రాథమిక స్థాయిలో ఈ కోర్సులలో చేరాలనుకునేవాళ్లకు కౌన్సిలింగ్ ఇవ్వటం ద్వారా వాళ్ళు తగిన నిర్ణయం తీసుకునే వెసులుబాటు కల్పిస్తారు.
ఇప్పటివరకు లా, మెడికల్, ఇఁజనీరిఁగ్, మేనేజ్ మెఁట్ లాఁటి కోర్సులకే పరిమితమైన ఉమ్మడి ప్రవేశ పరీక్ష ఇప్పుడు ఈ విధంగా మీడియాలో కూడా మొదలైంది. మొత్తం 100 మార్కులు ఉండే ఈ ప్రవేశ పరీక్షకు 100 మార్కులు. ఐదు విభాగాలుగా ఉంటుంది. ఆబ్జెక్టివ్ టైప్ సమాధానాలుంటాయి. ఆగస్టు 12 వరకు దరఖాస్తు చేసుకునే అవకాశం ఉంది. వివరాలకోసం www.aimcet.in వెబ్ సైట్ చూడవచ్చు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here