కేబుల్ నెట్ ఎక్స్ పో స్పాన్సర్లకు సిఎన్ సి అధిపతి కృతజ్ఞతలు

0
452

హైదరాబాద్ హైటెక్స్ లో మూడు రోజులపాటు జరిగిన కేబుల్ నెట్ ఎక్స్ పో -2021 అంచనాలకు మించి సందర్శకులను ఆకట్టుకొని విజయవంతమైంది. రెండు తెలుగు రాష్ట్రాలతోబాటు తమిళనాడు, కర్ణాటక, మహారాష్ట్ర నుంచి సైతం కేబుల్, బ్రాడ్ బాండ్ రంగాలకు చెందినవారు రావటంతో మూడు రోజుల్లో రికార్డు స్థాయిలో 30 వేల మందికి పైగా సందర్శించారు.
గతంలో లాగానే ఈ సారి కూడా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నుంచి సహకారం, ప్రోత్సాహం లభించాయి. ఐటీ శాఖ పరిధిలో ఉన్న టి ఫైబర్ (తెలంగాణ ఫైబర్ గ్రిడ్) డైమండ్ స్పాన్సర్ గా చేయూతనిచ్చింది. తెలంగాణ పర్యాటక శాఖ అండగా నిలిచి “పవర్డ్ బై తెలంగాణ టూరిజం” అని చెప్పుకునేట్టు చేసింది. బ్రోచర్ ఆవిష్కరించటంతోబాటు ప్రదర్శనను ప్రారంభించిన మంత్రి శ్రీ వి. శ్రీనివాస్ గౌడ్ ఎక్సైజ్ క్రీడలు, యువజన సర్వీసులతోబాటు పర్యాటక శాఖకు సైతం మంత్రి కావటం ఈ ప్రదర్శన విజయానికి దోహదపడింది.
గోల్డ్ స్పాన్సర్లుగా ఉల్కా టీవీ, పాలీ ఇన్ఫోకామ్ కేబుల్స్ ప్రైవేట్ లిమిటెడ్, సిల్వర్ స్పాన్సర్లుగా ఎస్ ఎస్ ఎల్ సి స్మార్ట్ నెట్, భీమవరం కేబుల్ నెట్ వర్క్ (బీసీఎన్), డిజిటల్ కేబుల్ టీవీ, బ్రాడ్ బాండ్ సంస్థ జీటీపీఎల్, అసోసియేట్ స్పాన్సర్లుగా పయనీర్ డిజిటల్ టీవీ, మైత్రిల్ టెలికామ్. ఆప్ట్రానిక్స్, ఇన్ వాస్, చానల్ మాస్టర్ ప్రైవేట్ లిమిటెడ్ ఈ ప్రదర్శన నిర్వహించటానికి అండగా నిలిచాయని సి ఎన్ సి గ్రూప్ రాము ధన్యవాదాలు తెలియజేశారు.
వ్యక్తిగతంగానూ, తమ సంస్థల తరఫున అనేక విధాలుగా సాయపడినవారికి, ప్రారంభ, ముగింపు కార్యక్రమాలలో పాల్గొన్నవారికి, కేబుల్ సంఘాల నాయకులకు, ఎమ్మెస్వోలకు, అనేక ప్రాంతాలనుంచి తరలివచ్చి ఈ మూడు రోజుల ప్రదర్శనను విజయవంతం చేసినవారికి శ్రీ రాము కృతజ్ఞతలు తెలియజేశారు. ప్రదర్శన ఎంతగానో ఉపయోగ పడిందంటూ వేలాదిమంది ధన్యవాదాలు, అభినందనలు తెలియజేయటం ఆనందంగా ఉందని, ఇకముందు కూడా ప్రదర్శనలు ఏర్పాటు చేయటానికి ప్రోత్సాహకరంగా ఉందని ఆయన అన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here