కేబుల్ వినియోగదారుల పట్ల భారం మోపుతూ

0
1261

చిన్న కేబుల్ ఆపరేటర్ లను నిర్వీర్యం చేసేవిధంగా ట్రాయ్ తీసుకున్న NTO 2 Price విధానమును ను వెంటనే ఉపసంహరించుకోవాలని గ్రామీణ కేబుల్ ఆపరేటర్ ల సంఘం రాష్ట్ర కమిటీ కన్వీనర్ బడుగుల ఉపేందర్ డిమాండ్ చేశారు. శనివారం Narketpally లో ఏర్పాటు చేసిన రాష్ట్ర కమిటీ సమావేశంలో మాట్లాడుతూ…

పేద, మధ్య తరగతి సామాన్యులు కేబుల్ టీవీ ఛానెల్స్ దూరమయ్యే విధంగా ధరలను పెంచుతూ ట్రాయ్ నిర్ణయం ఉందని, వేలాది కుటుంబాలు ఆధారపడి జీవిస్తున్న కేబుల్ టీవీ ఆపరేటర్ వ్యవస్థనే లేకుండా చేస్తూ DTH , Pay Channel Broad Caster Corprate సంస్థలకు కొమ్ము కాస్తూ ట్రాయ్ తీసుకున్న నిర్ణయాన్ని వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. ఇప్పటి కైనా స్వయం ఉపాధి తో నిలబెట్టుకున్న వ్యవస్థను కాపాడాలని , TRAI తీసుకున్న నిర్ణయాన్ని పునః పరిశీలించి కేబుల్ ఆపరేటర్ ల మరియు వినియోగదారులను దృష్టిలో ఉంచుకొని నిర్ణయం తీసుకోవాలని కోరారు.ఈ కార్యక్రమం లో MSO లు చిలుముల జితేందర్ రెడ్డి, వెంకటేశ్వర్ రావు, వాసా విద్యాసాగర్, జిల్లా నాయకులు అలుగుబెల్లి భాస్కర్ రెడ్డి, గూడూరు అంజిరెడ్డి, రవి, కత్తి శ్రీనివాస్ రెడ్డి, కొండల్, పాటి వెంకటరెడ్డి, జిల్లా వెంకన్న, శ్రీను, ఆపరేటర్లు శ్రీహరి, యాదగిరి రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here