కేబుల్ ఆపరేటర్ల ఆశలమీద నీళ్ళు చల్లిన కేరళ హైకోర్ట్

0
1120

టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా ( ట్రాయ్) జారీ చేసిన మూడో టారిఫ్ ఆర్డర్ (ఎన్టీవో 3.0) అన్యాయమంటూ అఖిలభారత డిజిటల్ కేబుల్ సమాఖ్య ( ఏఐడిసిఎఫ్) దాఖలు చేసిన పిటిషన్ ను కేరళ హైకోర్టు కొట్టివేసింది. 2022 నవంబర్ లో జారీ చేసిన టారిఫ్ ఆర్డర్ వలన కేబుల్ పరిశ్రమ దెబ్బతినే ప్రమాదముందని, చందాదారులమీద భారం పెరిగితే కేబుల్ కనెక్షన్లు తొలగించే అవకాశం ఉందని డిజిటల్ కేబుల్ సమాఖ్య ఆ పిటిషన్ లో కోరింది.
అయితే, కేరళ హైకోర్టు ఆ పిటిషన్ ను విచారణకు తీసుకున్నప్పటికీ, స్టే ఇవ్వకపోవటంతో బ్రాడ్ కాస్టర్లు ఎలాగైనా ఎన్టీవో 3.0 అమలు చేయాల్సిందేనని నిర్ణయించుకున్నారు. కొత్త రిఫరెన్స్ ఇంటర్ కనెక్ట్ ఆఫర్ (ఆర్ ఐ వో) మీద సంతకాలు చేయకపోతే సిగ్నల్స్ నిలిపివేస్తామని ప్రధాన బ్రాడ్ కాస్టర్లు – డిస్నీ స్టార్, జీ ఎంటర్టైన్మెంట్ ఎంటర్ ప్రైజెస్, సోనీ పిక్చర్స్ నెట్వర్క్ ఇండియా ప్రకటించారు. కోర్టు తీర్పు వాయిదా పడటం, చందాదారులు ప్రసారాల కోసం ఎదురు చూస్తూ ఉండటంతో ఎమ్మెస్వోలు తప్పనిసరి పరిస్థితుల్లో పెరిగిన ధరలతో ప్రసారాలు పునరుద్ధరించారు.
కోర్టు తీర్పు అనుకూలంగా వెలువడితే ధరలు తగ్గుతాయని ఆశించిన కేబుల్ పరిశ్రమకు నిరాశే ఎదురైంది. మార్చి 7 న తీర్పు రిజర్వ్ కాగా, ఈ రోజు తీర్పు వెలువరించిన కేరళ హైకోర్టు కేబుల్ సమాఖ్య వారి పిటిషన్ ను కొట్టివేసింది. ఒక హైకోర్టు తీర్పు ఆధారంగా మిగిలిన హైకోర్టులు కూడా నిర్ణయం తీసుకునే అవకాశం ఉండటంతో తెలంగాణ హైకోర్టు సహా వివిధ కోర్టులలో ఎన్టీవో 3.0 మీద పీటీషన్లు సైతం నిలబడకపోవచ్చు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here