ఐదు వసంతాల బ్రైట్ వే : ఇంకా మునుముందుకు..

0
617

బ్రైట్ వే.. పేరుగు తగ్గట్టే అది వెలుగుబాట.. నిరంతరం కేబుల్ టీవీ రంగంలో సేవలు అందించటంతోబాటు ఈ రంగంలోని వారందరి మేలుకోసం అవిశ్రాంతంగా కృషి చేయటం సంస్థ  ఎండీ సుభాష్ రెడ్డి గారి ఆలోచనావిధానం. ఆయన సారధ్యంలో ఆపరేటర్లు, సాంకేతిక నిపుణులు, లోకల్ చానల్స్ సిబ్బంది, అనునిత్యం ఎదుగుతూ సంస్థ ఎదుగుదలకు దోహదం చేస్తున్నారు.  కేబుల్ వ్యాపారాన్ని కార్పొరేట్ గుప్పిట్లోకి వెళ్ళకుండా అడ్డుకోవాలన్న మిత్రుల ఆలోచనలకు కార్య రూపం ఇచ్చి ఆపరేటర్లను కూడా ఆదుకుంటూ బ్రైట్ వే సంస్థను ముందుండి  నడిపిస్తూ నిలబెట్టగలిగారు.

పాతికేళ్ళ అనుభవ సారం

కేబుల్ రంగంలో అంచలంచెలుగా ఎదుగుతూ, సేవలు విస్తరిస్తూ కేబుల్ ఆపరేటర్ గా ప్రారంంభమై ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కుంటూ ఈ రంగంలో ఎదురయ్యే కష్టనష్టాలకోర్చి ఎప్పటికప్పుడు అవగాహన పెంచుకోవటం వల్లనే ఈ రోజు భావసారూప్యం ఉన్న మరికొందరు మిత్రులతో కలిసి బ్రైట్ వే హెడ్ ఎండ్ స్థాపించటం సాధ్యమైంది.  కేబుల్ పంపిణీ రంగం అనుభవం, చందాదారుల ఆదరాభిమానాలూ, వందలకొద్దీ ఉన్న  కేబుల్ ఆపరేటర్ల అండదండలూ, రేయింబవళ్ళూ సంస్థకోసం పనిచేసే సిబ్బంది సహకారం బ్రైట్ వే ఎదుగుదలకు దోహదం చేశాయి.

అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానం

మార్పు ఎప్పుడూ జరుగుతూనే ఉంటుంది. మార్పుకు తగినట్టుగా మారటం ఒక ఎత్తు. కానీ మార్పును ముందుగానే పసిగట్టి ఇంకా ముందుండటానికి చేసే ప్రయత్నం బ్రైట్ వే డిజిటల్ హెండ్ ఎండ్ సాంకేతిక పరిజ్ఞానం చూసినవారెవరైనా ఒప్పుకోవాల్సిందే. ఎప్పటికప్పుడు రేపటి గురించి ఆలోచించగలగటమే దీని వెనుక అసలు రహస్యం. తన ఆలోచనా విధానాన్ని మిత్రులతో పంచుకొని అంతర్జాతీయ స్థాయి డిజిటల్ హెడ్ ఎండ్, దానికి తగిన సాఫ్ట్ వేర్ సమకూర్చుకోవటంలో బ్రైట్ వే ఎండీగా ఆయన కృషిని మెచ్చుకొని తీరాల్సిందే, సెట్ టాప్ బాక్సుల విషయంలోనూ అదే విధమైన ఆలోచనతో నాణ్యమైనవి ఎంపికచేసి చందాదారుల మన్ననలందుకోవటం బ్రైట్ వే  నాణ్యతాప్రమాణాలకు నిదర్శనం. 

బ్రాడ్ కాస్టర్లతో నెయ్యమైనా, కయ్యమైనా…

కేబుల్ వ్యాపారంలో కీలకభాగస్వామి బ్రాడ్ కాస్టర్. అయితే, వీలైనంత ఎక్కువ సంపాదించుకోవాలని ప్రయత్నించే బ్రాడ్ కాస్టర్ నుంచి మొత్తం కేబుల్ పరిశ్రమను కాపాడేందుకు సామ, దాన, భేద, దండోపాయాలు ప్రయోగించక తప్పదన్నదే సుభాష్ రెడ్డి గారి ఆలోచన. అందుకు తగిన వ్యూహాలతో బ్రాడ్ కాస్టర్లకు సలహాలిచ్చినా, అభినందించినా, అవసరమొస్తే వాగ్వాదాలూ, ఆందోళనతో వాళ్లను మెట్టు దించినా అది ఆయనకే చెల్లింది. మొత్తంగా చూసినప్పుడు కేబుల్ పరిశ్రమకు మేలు జరగటమన్నదే ఆయన అంతిమ లక్ష్యం.

కార్పొరేట్ ఎమ్మెస్వోలకు దీటుగా 

నెట్ వర్క్ లను సొంతం చేసుకుంటూ దూకుడుగా వెళుతున్న కార్పొరేట్ ఎమ్మెస్వోలకు కళ్ళెం వేయటం బ్రైట్ వే గొప్పదనం. కేబుల్ ఆపరేటర్ల, చిన్న ఎమ్మెస్వోల ఆత్మగౌరవాన్ని కాపాడుతూ లాభాపేక్షకు ప్రాధాన్యం ఇవ్వకుండా ఎంతో సాహసంతో బ్రైట్ వే ఒక స్వతంత్ర ఎమ్మెస్వోగా ముందుకొచ్చింది. నాణ్యతలో రాజీపడకుండా కార్పొరేట్ ఎమ్మెస్వోలను సవాలు చేయగల సత్తా తనకున్నదని బ్రైట్ వే చాటుకోగలిగింది. పాకేజీలలో, రాయితీలలో వాళ్ళకంటే ముందుంటూ ఆపరేటర్ కు న్యాయం చేయగలిగింది. అందుకే బ్రైట్ వే ఆపరేటర్లు బ్రైట్ వే పట్ల ఎంతో విశ్వాసం వ్యక్తం చేస్తూ అంకితభావంతో సంస్థ ఎదుగుదలలో పాలుపంచుకుంటారు.

గ్రామీణ ఆపరేటర్లకోసం

ఒక వైపు ఎమ్మెస్వోల ప్రయోజనాలకోసం కృషి చేస్తూనే ఉన్నా, పరిశ్రమలో కీలకమైన ఆపరేటర్లు ఎక్కువగా లాభపడాలన్నదే బ్రైట్ వే లక్ష్యం. అందుకే ఒక లాభాపేక్షలేని హెడ్ ఎండ్ నడపటానికి మిత్రులందరినీ ఒప్పించి ఈ బాధ్యత తలకెత్తుకున్నారు. ఒకప్పటి ఆపరేటర్ గా తనకు ఆపరేటర్ల కష్టాలు తెలియటం వల్లనే సమస్యలు రాకముందే పరిష్కారాలగురించి ఆలోచించటం ఆయన ధోరణిగా మారింది. ఆపరేట్ర్లకు అవసరమైన సాంకేతిక శిక్షణమొదలు ఆదాయ మార్గాలు వెతకటం దాకా ఆ ఆలోచనలు కొనసాగుతూనే ఉంటాయి.

డిటిహెచ్ తో ఢీ

గ్రామీణ కేబుల్ ఆపరేటర్లకు పోటీగా నిలిచే డిటిహెచ్ వలన ఎదురవుతున్న ఇబ్బందులను గ్రహించి ఆపరేటర్లలో ధైర్యం నింపారు. డిటిహెచ్ లో ఉండే సౌకర్యాలను బాగా ప్రచారం చేయాలని, మెరుగైన సేవల ద్వారా చందాదారులను ఆకట్టుకోవాలని ఎప్పటికప్పుడు గ్రామీణ కేబుల్ ఆపరేటర్లలో ఉత్సాహం నింపారు. డిటిహెచ్ తో సాధ్యం కాని లోకల్ కేబుల్ చానల్స్ ను ప్రోత్సహించారు. అదనపు ఆదాయ వనరులకోసం బ్రాడ్ బాండ్ ను వాడుకోవాలని కోరారు. ఇది డిటిహెచ్ కి సాధ్యం కాదన్న విషయాన్ని సామాన్యుడికి అర్థమయ్యేట్టు చెప్పగలిగినప్పుడే కేబుల్ నిలదొక్కుకుంటుందని ఒప్పించగలిగారు.

భవిష్యత్ కోసం ఒప్పందాలు

పంపిణీదారులకు అలాంటి ఆంటంకాలూ లేకుందా ప్రసారాలు అందటానికి వీలుగా ఎయిర్ టెల్ తో కుదుర్చుకున్న ఒప్పందడం ఫలితంగా హెడ్ ఎండ్ నుంచి ఇప్పుడు ప్రతి మండల కేంద్రానికీ వందలాది చానల్  ప్రసారాలు అందుతున్నాయి. అక్కడినుంచి పంపిణీ దారులు/ఆపరేటర్లు తమ సొంత నెట్ వర్క్ తో ఇంటింటికీ అందిస్తున్నారు.  అదే విధంగా బ్రాడ్ బాండ్ పంపిణీ ఆదాయం పెంచుకుంటూనే కేబుల్ ఆపరేటర్ ఆదాయానికి హామీ ఉంటుందన్న అభిప్రాయంతో బి ఎస్ ఎన్ ఎల్ తో కుదుర్చుకున్న ఒప్పందం ఫలితంగా ఈ వ్యాపారాన్ని ఆపరేటర్లకు అందుబాటులోకి తీసుకు వచ్చిన ఘనత కూడా బ్రైట్ వే ఎందీ గా శ్రీ సుభాష్ రెడ్ది గారికి దక్కుతుంది.

శిక్షణ..శిక్షణ

కేబుల్ రంగానికి సంబంధించి శిక్షణ ఇచ్చే కోర్సులేవీ అందుబాటులో లేవు. కానీ ఇది నిరంతరం మారే టెక్నాలజీతో ముడిపడి ఉంది. అందుకే స్వయగా శిక్షణ ఇవ్వటానికి ఆయనెప్పుడూ వెనకాడరు. తెలంగాణ లొని అనేక ప్రాంతాలు తిరిగి డిజిటైజేషన్ మీద శిక్షణ ఇచ్చిన ఏకైక ఎమ్మెస్వో ఆయన.  బ్రైట్ వే ఆపరేటర్లందరికీ ఈ విషయం తెలుసు. అంతే కాదు, ఆపరేటర్ల ఆదాయం పెంచుకోవటానికి బ్రాడ్ బాండ్ సరైన మార్గమని గ్రహించి ఎఫ్ టి టిహెచ్ మీద కూదా అవగాహన కోసం శిక్షణాతరగతులు చేపట్టారు. సొంతలాభం కొంత మానుకు పొరుగువాడికి తోడుపడవోయ్ అన్న గురజాడ మాటలు బ్రైట్ వే ఎండీకి అక్షరాలా వర్తిస్తాయి

అవగాహన పెంపుకోసం

టెక్నాలజీని వాడుకోవటం, పరిశ్రమలో వస్తున్న మార్పులను ఎప్పటికప్పుడు తెలుసుకోవటంలో బ్రైట్ వే ఎండీ శ్రీ సుభాష్ రెడ్ది ఎప్పుడూ ముందుంటారు. కానీ ఆ జ్ఞానాన్ని అందరికీ పంచాలనుకోవటం ఆయన విశాల హృదయానికి అద్దం పడుతుంది. ఆ క్రమంలోనే కేబుల్ సమాచార్ పత్రికను నాలుగేళ్లపాటు నిరంతరాయంగా నడిపి అత్యంత కీలకమైన డిజిటైజేషన్ సమయంలో కేబుల్ పరిశ్రమలోని వారందరికీ సమాచారం పంచుతూ అవగాహన పెంచారు. ఇప్పుడు ఇంకో అడుగు ముందుకేసి డిజిటల్ వేదిక ద్వారా సమాచారం ఇవ్వటానికి దానిని వెబ్ సైట్ రూపంలో అందుబాటులోకి తెచ్చారు.

కేబుల్ రంగానికి నాయకత్వం

అనుభవం, అందరికీ అందుబాటు, సేవాదృక్పథం అనే కీలకమైన లక్షణాలు ఆయనను బ్రైట్ వే సారధిగానే కాకుండా తెలంగాణ ఎమ్మెస్వోల సంఘానికీ అధ్యక్షుణ్ని చేశాయి. బలవంతపు డిజిటైజేషన్ సాగుతున్న  సమయంలో ప్రభుత్వం విధిమ్చిన గడువు ఆచరణ సాధ్యమని కోర్టుకెక్కి అనుకూల ఫలితం రాబట్టగలిగారు,. ఈ తీర్పు యావత్ భారతదేశానికీ వర్తించి కేబుల్ పరిశ్రమ మన్ననలందుకోగలిగింది.  అందరి ప్రయోజనాలనూ దృష్టిలో ఉంచుకొని వివిధ వేదికలమీద కేబుల్ రంగ సమస్యలను ప్రస్తావించటం, కేంద్ర మంత్రి స్థాయి దాకా సమస్యలను తీసుకువెళ్ళటం, రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపడుతున్న ఫైబర్ గ్రిడ్ ప్రాజెక్టుకు తనవంతుగా సూచనలిస్తూ, అందులోనూ కేబుల్ ఆపరేటర్ల ప్రయోజనాలు కాపాడాలని ప్రభుత్వాన్ని కోరటంలో ఆయన ఆలోచనా విధానం కనబడుతుంది.

సమర్ధుదైన శ్రీ సుభాష్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఐదేళ్ళు పూర్తి చేసుకున్న బ్రైట్ వే సంస్థ ఇదే ఉత్సాహంతో మరింత ముందుకు వెళ్లాలని, వినోదాన్నీ, విజ్ఞానాన్నీ సమాచారాన్నీ అనుక్షణం అందిస్తూ వెలుగులు పంచుతూ ఇంటింటి నేస్తంగా కొనసాగాలని, కార్పొరేట్ కుయుక్తులకు తలొగ్గకుండా తనదైన శైలిలో తిప్పికొడుతూ ముందుకు సాగాలని బ్రైట్ వే వ్యాపార భాగస్వాములు, మిత్రులు, సిబ్బంది, శ్రేయోభిలాషులందరి కోరిక.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here