పోలీసులకు మాస్కులు పంపిణీ చేసిన బ్రైట్ వే ఎండీ

0
468

తెలంగాణ లో అతిపెద్ద కేబుల్ నెట్ వర్క్స్ లో ఒకటైన బ్రైట్ వే సంస్థ తన సామాజిక సేవలను కొనసాగిస్తూ ఈ కరోనా సంక్షోభ సమయంలో కోవిడ్ యోధులుగా సేవలందిస్తున్న పోలీసుల సంక్షేమం కోసం వారికి నాణ్యమైన, అత్యంత సురక్షితమైన డబుల్ లేయర్ ( రెండు పొరల) మాస్కులు పంపిణీ చేసింది. సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ ప్రత్యేక శ్రద్ధతో మెదక్ జిల్లా పోలీసులకోసం ఈ కార్యక్రమం చేపట్టారు. ప్రజలకు కరోనా పట్ల అవగాహన కల్పించటంలో నిమగ్నమైన బ్రైట్ వే సంస్థ నేరుగా కోవిడ్ యోధులైన పోలీసులకు సురక్షితమైన మాస్కులు అందజేయటానికి రంగంలో దిగారు.
ఎన్ 6 న్యూస్ ఎండీ కరుణాకర్ రెడ్డి ద్వారా తూప్రాన్ డిఎస్పీకి మాస్కులు అందజేశారు. ఈ సందర్భంగా డీఎస్పీ మాట్లాడుతూ ప్రస్తుత అవసరానికి తగినట్టుగా పోలీసుల సంక్షేమాన్ని దృష్టిలోపెట్టుకొని సురక్షితమైన డబుల్ మాస్కులు అందజేసినందుకు బ్రైట్ వే ఎండీ శ్రీ సుభాష్ రెడ్డికి ధన్యవాదాలు తెలియజేశారు. ఇప్పటికే బ్రైట్ వే సంస్థ తరఫున ఒక ప్రచార వాహనాన్ని ఊరూరా తిప్పుతూ ప్రజలలో కరోనాపట్ల అవగాహన కల్పించి ప్రభుత్వ నిబంధనలను సక్రమంగా అమలు చేసేలా కృషి చేస్తున్నందుకు అభినందనలు తెలియజేశారు.
మాస్కులు అందజేసే కార్యక్రమంలో ఎన్ 6 న్యూస్ ఎండీ శ్రీ కరుణాకర్ రెడ్డి తోబాటు చానల్ రిపోర్టర్లు నరేందర్, ఆంజనేయులు గౌడ్, భాను, తిరుపతి తదితరులు కూడా పాల్గొనగా పోలీస్ సిబ్బంది హాజరయ్యారు.
బ్రిట్ వే ఎండీ శ్రీ సుభాష్ రెడ్డి దుండిగల్ పోలీస్ స్టేషన్ లో కూడా మాస్కులు పంపిణీ చేశారు. ఇలాంటి క్లిష్టమైన సంక్షోభ సమయంలో మాస్కులు ఇచ్చి కరోనా యోధులైన పోలీస్ సిబ్బంది పట్ల ప్రేమాభిమానాలు ప్రదర్శించటాన్ని, పోలీసుల సంక్షేమం గురించి ఆలోచించటాన్ని మెచ్చుకున్నారు.
నిజానికి మొదటి విడత కరోనా సంక్షోభ సమయంలోనూ బ్రైట్ వే అధినేత శ్రీ సుభాష్ రెడ్డి ఎన్నో సహాయ కార్యక్రమాలు చేపట్టిన విషయం తెలిసిందే. నిరుడు అనేక తెలంగాణ జిల్లాలలో ఎస్పీ కార్యాలయాలు, కలెక్టరేట్లు, జిల్లా కేంద్రాల్లోని ప్రభుత్వ ఆస్పత్రులలో శానిటైజర్లు అమర్చి తనకున్న సామాజిక స్పృహను, బాధ్యతను చాటుకున్నారు. అదే విధంగా అనేక అవగాహన కార్యక్రమాల ద్వారా ప్రజల్లో చైతన్యం తెచ్చారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here