చానల్స్ రేటింగ్స్ కు 2-3 నెలల విరామం

0
492

న్యూస్ చానల్స్ రేటింగ్స్ తాత్కాలికంగా నిలిపివేయాలని బ్రాడ్ కాస్ట్ ఆడియెన్స్ రీసెర్చ్ కౌన్సిల్ ( బార్క్ ) నిర్ణయించింది. హిందీ, ఇంగ్లిష్, ప్రాంతీయ భాషల న్యూస్ చానల్స్ తో బాటు బిజినెస్ న్యూస్ చానల్స్ కు కూడా ఈ విరామం వర్తిస్తుంది. ఇటీవలి పరిణామాల దృష్ట్యా ప్రేక్షకాదరణ టెక్నికల్ కమిటీ సమాచారాన్ని మరింత లోతుగా విశ్లేషించి సరిచూసుకోవటానికి 8 నుంచి 12 వారాలపాటు నిలిపివేయాలన్న నిర్ణయం తీసుకున్నట్టు బార్క్ వెల్లడించింది.

అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా పానెల్ ఇళ్లను గుర్తించి పకడ్బందీగా సమాచారం సేకరించి విశ్లేషిస్తున్నప్పటికీ కొందరు సభ్యులు లేవనెత్తుతున్న అభ్యంతరాల నేపథ్యంలో మరో మారు సరిచూసుకొని ఎలాంటి అవకతవకలకూ ఆస్కారం లేని విధంగా తీర్చి దిద్దటానికి టెక్నికల్ కమిటీ సంసిద్ధంగా ఉందని బార్క్ చైర్మన్ పునీత్ గోయెంకా, సీఈవో సునిల్ లల్లా ఒక సంయుక్త ప్రకటనలో తెలియజేశారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here