ఎంఐబీ సెక్రెటరీగా అపూర్వ చంద్ర నియామకం సమాచార

0
125

ప్రసార మంత్రిత్వశాఖ ( ఎంఐబీ) కొత్త సెక్రెటరీగా అపూర్వ చంద్ర నియమితులయ్యారు. కేంద్ర కాబినెట్ ఆయన నియామకాన్ని ఖరారు చేసింది. అంతకు ముందు ఆయన కార్మిక, ఉపాధికాల్పన మంత్రిత్వశాఖలో కార్యదర్శిగా ఉన్నారు. 1998 బాచ్ మహారాష్ట్ర కేడర్ ఐఏఎస్ అధికారి అయిన చంద్ర ఇంతకు ముందు మహారాష్ట్రలో ఏడేళ్ళకు పైగా పెట్రోలియం, సహజవాయువు మంత్రిత్వశాఖ లోనూ, నాలుగేళ్లపాటు పరిశ్రమల శాఖలో ప్రిన్సిపాల్ సెక్రెటరీగానూ పనిచేశారు. 2017 లో ఆయన రక్షణ మంత్రిత్వ శాఖలో స్పెషల్ డైరెక్టర్ జనరల్ గా చేరారు. రక్షణ రంగా కొనుగోళ్ళ బాధ్యతలు చూశారు. నిరుడు అక్టోబర్ లో కార్మిక, ఉపాధి కల్పన మంత్రిత్వశాఖలో కార్యదర్శి బాధ్యతలు చేపట్టగా ఐక్యరాజ్యసమితి అనుబంధ సంస్థ అయిన అంతర్జాతీయ కార్మిక సంస్థ ( ఐ ఎల్ ఓ ) కు 2020-2021 కాలానికి గవర్నింగ్ బాడీ అధ్యక్షునిగా కూడా ఎన్నికయ్యారు. ఇది అంతర్జాతీయంగా ప్రతిష్ఠాత్మకమైన హోదా.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here