ఎఫ్ టి టి హెచ్ విస్తరణ ప్రారంభించిన ఎయిర్ టెల్

0
475

భారతీ ఎయిర్ టెల్ సంస్థ ఫైబర్ టు ద హోమ్ (ఎఫ్ టి టి హెచ్) బ్రాడ్ బాండ్ సర్వీసులను పెద్ద ఎత్తున విస్తరించటం మొదలుపెట్టింది. ఇప్పటికే జియో 2,000 నగరాలు, పట్టణాలలో సేవలు మొదలుపెడుతూ ఉండటంతో దీనికి పోటీగా ఎయిర్ టెల్ కూడా రంగంలో దిగినట్టు తెలుస్తోంది. వచ్చే 12-18 నెలలకాలంలో దాదాపు వెయ్యి నగరాలు, పట్టణాలలో తన సర్వీస్ అందించాలని ఎయిర్ ఎల్ భావిస్తోంది.

దేశంలో 24 కోట్ల ఇళ్ళు ఉండగా అందులో ఆరోవంతు, అంటే నాలుగు కోట్ల ఇళ్ళకైనా  చేరుకోవాలన్నది ఎయిర్ తెల్ లక్ష్యం.  ఇప్పటికే కేబుల్ ఆపరేటర్లు దాదాపు 15 కోట్ల ఇళ్ళకు కేబుల్ లేదా ఫైబర్ వేసి ఉండటంతో వాళ్లద్వారా సేవలుఅందించటానికి ప్రయత్నించటంతోబాటు ఫైబర్ లేని చోట స్వయంగా ఫైబర్ వేసి బ్రాడ్ బాండ్ సేవలు అందించటానికి సిద్ధమవుతోంది. . ఆ విధంగా రెండు రకాలుగా పంపిణీకి సిద్ధం కావటం అనేక పట్టణాలలో సత్ఫలితాలు ఇచ్చిందని, స్థానిక వ్యాపార భాగస్వాములను కలుపుకోవటం ద్వారా వారిని ప్రోత్సహించటానికి ప్రాధాన్యం ఇస్తున్నామని ఎయిర్ టెల్ చెబుతోంది. కొత్త తరం కేబుల్ ఆపరేటర్లు ఇలాంటి ఉమ్మడి వ్యాపారం పట్ల ఆసక్తి చూపుతున్నారని, ఇరుపక్షాలూ లాభం పొందే అవకాశానికే తాము కూడా మొగ్గు చూపుతున్నామని ఎయిర్ టెల్ చెబుతోంది. ప్రస్తుతం ఎయిర్ టెల్ 14 నగరాలలో తరహా భాగస్వామ్యంతోనే బ్రాడ్ బాండ్ సేవలందిస్తోంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here