ఎన్టీవో 3.0 మీద అప్పీలుకు వెళ్ళే ఆలోచనలో కేబుల్ సమాఖ్య?

0
360

టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా ( ట్రాయ్) 2022 నవంబర్ లో జారీచేసిన టారిఫ్ ఆర్డర్ ( ఎన్టీవో 3.0) మీద పిటిషన్ ను కేరళ హైకోర్ట్ డిస్మిస్ చేసిన నేపథ్యంలో అప్పీలుకు వెళ్లాలని ఆలిండియా డిజిటల్ కేబుల్ ఫెడరేషన్ ఆలోచిస్తున్నట్టు తెలుస్తోంది. కొత్త టారిఫ్ ఆర్డర్ వలన చందాదారుల నెలసరి కేబుల్ బిల్లు సగటున 40-50 రూపాయల మేర పెరిగే అవకాశం కనిపిస్తుండటంతో ఇది పరిశ్రమను దెబ్బతీస్తుందంటూ ఫెడరేషన్ కేరళ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. అయితే, ఇందులో ఎలాంటి చట్ట వ్యతిరేకతా లేదంటూ సింగిల్ జడ్జ్ ఆ పిటిషన్ ను డిస్మిస్ చేశారు.

ఈ లోపు బ్రాడ్ కాస్టర్ల వత్తిడి కారణంగా కొత్త టారిఫ్ తో రిఫరెన్స్ ఇంటర్ కనెక్ట్ ఆఫర్ ల మీద సంతకాలు చేసి ప్రసారాల పంపిణీ సాగిస్తున్నారు. అయితే, తీర్పు ఇచ్చింది సింగిల్ జడ్జ్ కాబట్టి విస్తృత ధర్మాసనానికి అప్పీల్ చేయాలని డిజిటల్ కేబుల్ సమాఖ్య ఆలోచిస్తున్నట్టు తెలుస్తోంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here