వచ్చే ఆర్థిక సంవత్సరంలోనే 5జి సేవలు: ఆర్థికమంత్రి

0
490

వచ్చే ఆర్థిక సంవత్సరం 2022-23 లోనే 5 జి సేవలు అందుబాటులోకి వస్తాయని ఆర్థికమంత్రి నిర్మలాసీతారామన్ బడ్జెట్ ప్రసంగంలో వెల్లడించారు. స్పెక్ట్రమ్ వేలం కూడా 2022-23 ఆర్థిక సంవత్సరంలో జరిగుతుందన్నారు. ఆ వెనువెంటనే ప్రైవేట్ కంపెనీలు తమ సేవలు అందించటానికి రంగంలో దిగుతాయి.
ఇప్పటికే అనేక టెలికాం సంస్థలు ట్రయల్ పూర్తి చేసి సంసిద్ధతను వెల్లడించాయి. ఇందులో భాగంగా ఆప్టికల్ ఫైబర్ లైన్లు వేసే కాంట్రాక్టు పని ప్రభుత్వ, ప్రైవేట్ భాగస్వామ్యంలో చేపడతామని మంత్రి వెల్లడించారు.
గ్రామీణ, మారుమూల ప్రాంతాలలో అందుబాటు ధరలో బ్రాడ్ బాండ్, మొబైల్ అందుబాటు పెరగటానికి వీలుగా వసూళ్లలో 5 శాతం మొత్తాన్ని యూనివర్సల్ సర్వీస్ ఆబ్లిగేషన్ ఫండ్ కేటాయిస్తామని నిర్మలాసీతారామన్ చెప్పారు. ఉత్పత్తి అనుసంధానిత ప్రోత్సాహక (పి ఎల్ ఐ) పథకాన్ని 5 జి తదితర టెక్నాలజీలకోసం రూపొందించే డిజైన్ చొరవలకు కూడా విస్తరింపజేస్తామని తెలియజేశారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here