రెండు నెలల్లో తెలంగాణకు 4 ఎమ్మెస్వో లైసెన్సులు

0
645

గడిచిన ఆగస్టు, సెప్టెంబర్ నెలల్లో దేశవ్యాప్తంగా 15 డిజిటల్ ఎమ్మెస్వో లైసెన్సులు జారీ కాగా అందులో అత్యధికంగా తెలంగాణ రాష్ట్రానికి 4 లైసెన్సులు మంజూరు కావటం విశేషం. ఈ పదిహేను లైసెన్సులలో  తెలంగాణకు 4. గుజరాత్ కు 3, ఉత్తరప్రదేశ్ కు 2 లైసెన్సులు రాగా ఉత్తరాఖండ్. పంజాబ్, పశ్చిమబెంగాల్, త్రిపుర, తమిళనాడు, మహారాష్ట్ర రాష్ట్రాలకు ఒక్కొక్క లైసెన్స్ మంజూరైంది.

తెలంగాణలో లైసెన్స్ పొందిన నాలుగు సంస్థలూ హైదరాబాద్ నగరానికే చెందినవి కావటం కూడా విశేషం. అత్తాపూర్ (రాజేంద్రనగర్) కు చెందిన గ్లోబ్ డిజిటల్ మీడియా ప్రైవేట్ లిమిటెడ్, మాదాపూర్ హైటెక్ సిటీకి చెందిన పయనీర్ డిజిటల్ టీవీ, కుకట్ పల్లిలోని బాలాజీనగర్ కు చెందిన వాయు మీడియా (పరిమిత ఋణభార భాగస్వామ్య సంస్థ). విజయనగర్ కాలనీకి చెందిన కుమార్ బ్రాడ్ బాండ్ సర్వీసెస్ ప్రైవేట్ లిమిటెడ్ తాజాగా ఆగస్టు, సెప్టెంబర్ నెలల్లో డిజిటల్ ఎమ్మెస్వో అనుమతి పొందాయి.

ఈ అనుమతులతో దేశవ్యాప్తంగా కేబుల్ వ్యాపారం నిర్వహించుకునే అవకాశం ఉంటుంది. అనుమతి కాలపరిమితి మంజూరైన తేదీ మొదలుకొని పదేళ్లపాటు అమలులో ఉంటుంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here