దక్షిణాది టాప్-5 లో 3 తెలుగు చానల్స్

0
572

బ్రాడ్ కాస్ట్ ఆడియెన్స్ రీసెర్చ్ కౌన్సిల్ బార్క్ తాజాగా సరికొత్త లెక్కింపు సమాచారాన్ని కూడా ప్రేక్షకుల కోసం వర్గీకరించి ఇవ్వటం మొదలుపెట్టింది. భాషల వారీగా మార్కెట్లను విభజించి అక్కడి ప్రేక్షకాదరణ లెక్కగట్టటంతోబాటు ఈ సారి దక్షిణాదిని ఒక యూనిట్ గా తీసుకొని లెక్కలు వెల్లడించింది.
ఆ విధగా చూసినప్పుడు దక్షిణాదిన తమిళ చానల్ సన్ టీవీ ( 2846.51) తన తిరుగులేని ఆధిక్యం ప్రదర్శించగా తెలుగు చానల్ స్టార్ మా (2380.98) రెండో స్థానంలోను, స్టార్ గ్రూప్ కి చెందిన తమిళ చానల్ స్టార్ విజయ్ మూడో స్థానంలోను నిలిచాయి. తెలుగు చానల్స్ జీ తెలుగు (1491.68), ఈటీవీ తెలుగు (1339.05) వరుసగా నాలుగు, ఐదు ర్యాంకులు సంపాదించుకుననయి.
దీంతో టాప్ 5 లో రెండు తమిళ, మూడు తెలుగు చానల్స్ ఉన్నట్టయింది. వీటి మొత్తం ప్రేక్షకాదరణ పరంగా చూసినప్పుడు మాత్రం సహజంగానే రెండు తమిళచానల్స్ కంటే మూడు తెలుగు చానల్స్ కు ఆదరణ ఎక్కువగా ఉంది. యాజమాన్యం పరంగా స్టార్ గ్రూప్ ఆధిపత్యం స్పష్టంగా కనబడుతోంది. కన్నడ, మలయాళ భాషల చానల్స్ ఏవీ టాప్ 5 జాబితాలోకి రాలేకపోయాయి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here