3 రోజుల కేబుల్ ఎక్స్ పో విజయవంతం: 30 వేలమంది హాజరు

0
757

కేబుల్ టీవీ పరిశ్రమ ప్రతిష్ఠాత్మకంగా భావించే కేబుల్ ఎక్స్ పో మూడు రోజులపాటు విజయవంతంగా జరిగి నేడు ముగిసింది. ఈ ప్రదర్శన విజయవంతం కావటానికి దోహదం చేసిన ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మాధ్యమాలవారికి, రెండు తెలుగు రాష్ట్రాలతో బాటు తమిళనాడు, కర్ణాటక వంటి పొరుగు రాష్ట్రాలనుంచి వచ్చి పాల్గొన్న కేబుల్ ఆపరేటర్లకు, ఎమ్మెస్వోలకు, స్టాల్స్ నిర్వాహకులకు తెలంగాణ ఎమ్మెస్వోల సమాఖ్య అధ్యక్షులు శ్రీ ఎం. సుభాష్ రెడ్డి ధన్యవాదాలు తెలియజేశారు. ఎలాంటి లోపాలూ లేకుండా ఈ తొమ్మిదవ కేబుల్ నెట్ ఎక్స్ పో నిర్వహించిన సిఎన్ సి గ్రూప్ అధిపతి శ్రీ రామును ప్రత్యేకంగా అభినందించారు.
కోవిడ్ కారణంగా ఏడాది విరామం తరువాత ఈ ప్రదర్శనను ప్రకటించినప్పటినుంచీ దీనికి ప్రాచుర్యం కల్పించటం లోనూ, హాజరు కావాల్సిందిగా కేబుల్ ఆపరేటర్లకు విజ్ఞప్తి చేయటంలోనూ శ్రీ సుభాష్ రెడ్డి ముందున్నారు. హైదరాబాద్ ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో శ్రీ రాము తోబాటు శ్రీ సుభాష్ రెడ్డి, శ్రీ జితేంద్ర తదితరులు పాల్గొన్నారు. ఎక్స్ పో గురించి ప్రచారం చేయటంలో ఎలక్ట్రానిక్, ప్రింట్ మాధ్యమాలు బాగా సహకరించాయి.
ప్రదర్శన ప్రారంభమైన 27 న ఉదయం 11 గంటలకే స్టాల్స్ అన్నీ సిద్ధంకాగా అనేక రాష్ట్రాలనుంచి కేబుల్, బ్రాడ్ బాండ్ ఆపరేటర్లు రావటం మొదలైంది. సాయంత్రం ప్రారంభోత్సవానికి మంత్రి శ్రీ శ్రీనివాస్ గౌడ్ హైటెక్స్ ప్రాంగణానికి చేరుకున్నప్పుడు ప్రదర్శన నిర్వాహకుడైన సి ఎన్ సి గ్రూప్ అధిపతి శ్రీ రాము తోబాటు కేబుల్ రంగా ప్రముఖులందరూ ఆయనకు ఎదురేగి ఘనంగా స్వాగతం పలికారు. రిబ్బన్ కత్తిరించి లాంఛనంగా ప్రదర్శనను ప్రారంభించిన మంత్రి ఈ ప్రదర్శన జరుగుతున్న ప్రాంగణమంతా కలియదిరిగారు. బ్రైట్ వే ఎండీ శ్రీ సుభాష్ రెడ్డి తమ సంస్థ స్టాల్ కు మంత్రిని ఆహ్వానించి తాము వినియోగిస్తున్న అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని, సరికొత్త ఆఫర్లను వివరించారు.
సభాధ్యక్షత వహించిన శ్రీ సుభాష్ రెడ్డి ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన మంత్రి శ్రీ శ్రీనివాస్ గౌడ్ ను వేదికమీదికి ఆహ్వానించగా శ్రీ రాము పుష్పగుచ్ఛంతో స్వాగతం పలికారు. తెలంగాణ ఎమ్మెస్వోల సమాఖ్య గౌరవాధ్యక్షులు శ్రీ ప్రభాకర రెడ్డి, జీటీపీఎల్ వైస్ ప్రెసిడెంట్ శ్రీ మనోజ్ దూబే, కేబుల్ ఆపరేటర్ల సంక్షేమ సంఘం అధ్యక్షుడు శ్రీ జితేంద్ర, ఎమ్మెస్వో శ్రీ కొల్లా కిశోర్ కుమార్, కేబుల్ రంగ నాయకులు శ్రీ కోటి, శ్రీ పమ్మి సురేష్ తదితరులు ప్రసంగిస్తూ కేబుల్ రంగం ఎదుర్కుంటున్న సమస్యలను ప్రస్తావించారు. సాంకేతికంగా వస్తున్న మార్పులను స్వీకరిస్తున్న కేబుల్ రంగానికి జేఎస్టీ భారం, పోల్ టాక్స్ లాంటి సమస్యలున్నాయని గుర్తు చేశారు.
మార్పు అనివార్యమనే విషయం తెలుసుకొని కేబుల్ రంగం త్వరపడకపోతే భవిష్యత్తులో ఇబ్బందులు తప్పవని నిర్వాహకుడు శ్రీ రాము హెచ్చరించారు. అలాంటి అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని పరిచయం చేయటానికే ఎంతో శ్రమకోర్చి ఈ ప్రదర్శన ఏర్పాటు చేశామన్నారు.
కేబుల్ రంగంతో తనకున అనుబంధాన్ని నెమరువేసుకుంటూ ఉద్యమకాలంలో కేబుల్ రంగం అందించిన సేవలు మరువరానివని ఈ ప్రారంభ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన మంత్రి శ్రీ శ్రీనివాస్ గౌడ్ తన ప్రసంగంలో చెప్పారు. కేబుల్ ఆపరేటర్లు కొత్త టెక్నాలజీని అందిపుచ్చకుకోవాలని పిలుపునిచ్చారు, పోల్ టాక్స్ విషయాన్ని ఐటీ శాఖామంత్రి కేటీఆర్, ముఖ్యమంత్రి కెసీఆర్ దృష్టికి తీసుకువెళ్ళి పరిష్కారంఅయ్యేందుకు తనవంతు కృషి చేస్తానని హామీ ఇచ్చారు.
హాత్ వే రాజశేఖర్ కు ఘన నివాళి
కేబుల్ టీవీ రంగంలో తనదైన ముద్రవేసిన హాత్ వే మాజీ సీవో రాజశేఖర్ ప్రథమ వర్ధంతిని కేబుల్ నెట్ ఎక్స్ పో వేదికమీద నేడు నిర్వహించారు. కేబుల్ రంగానికి ఆయన చేసిన సేవలను కేబుల్ రంగ ప్రముఖులు కొనియాడుతూ నివాళులర్పించారు. కేబుల్ ఆపరేటర్లు, ఎమ్మెస్వోల పక్షాన నిలబడి బ్రాడ్ కాస్టర్లతో పోరాడి విజయం సాధించారని ఈ సందర్భంగా మాట్లాడిన వారు ఆయనను గుర్తు చేసుకున్నారు. అంతకుముందు వేదికమీద ఏర్పాటు చేసిన ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి అంజలి ఘటించారు.
స్పందన అనూహ్యం: రాము
ఒక ఏడాది ఆలస్యంగా నిర్వహిమకిన ఈ 9 వ కేబుల్ నెట్ ఎక్స్ పో ఘనవిజయ సాధించటం పట్ల దీని నిర్వాహకుడైన సి ఎన్ సి గ్రూప్ అధినేత శ్రీ రాము హర్షం వ్యక్తం చేశారు. తనను అన్నివిధాలా ప్రోత్సహించి నడిపించిన ఎమ్మెస్వోలకు, పెద్ద ఎత్తున హాజరైన కేబుల్ ఆపరేటర్లు, ఎమ్మెస్వోలు, టెక్నీషియన్లకు, స్టాల్స్ ఏర్పాటు చేసిన ఎమ్మెస్వోలకు, సాంకేతిక సంస్థలకు ఆయన ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు. కరోనా భయాన్ని పక్కనబెట్టి 30 వేలమందికి పైగా సందర్శకులు రావటం ఈ ప్రదర్శన అనూహ్య విజయానికి సాంకేతమన్నారు. భవిష్యత్తులో రెట్టించిన ఉత్సాహంతో ఎక్స్ పో నడపటానికి ఈ విజయమే ప్రోత్సాహమని చెబుతూ మొదటి నుంచీ ప్రచారం కల్పించి విజయానికి కారణమైన మీడియాకు ధన్యవాదాలు తెలియజేశారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here